సహజం...!?:- డా ప్రతాప్ కౌటిళ్యా.


ఈ భూమిపై పుట్టిన 
ప్రతి ఒక్కరిని ఈ ప్రపంచం 
ఏదో ఒకటి అవ్వాలంటుంది 
ఏదో ఒకటి తను నిరూపించుకోవాలంటుంది. 

ఒకవేళ 
నీవు సముద్రం కావాలనుకుంటావు 
కానీ అక్కడ సముద్రం ముందే ఉంది 
నీవు మరో సముద్రం కాలేవు 
ఒకవేళ అయినా ఒక నదిలా ఆ సముద్రంలో 
కలవాల్సిందే తప్ప గొప్ప సముద్రానివి కాలేవు.

గొప్పతనం 
ఒక సముద్రం కావడమో
ఒక మహా పర్వతం కావడమో
ఒక దుర్భేద్య మహారణ్యం కావడమో కాదు 
సహజంగా ఉండడం. 

ఏ ఆకారం లేని ఏ రంగు లేని 
ఏ ఆకారంలోకైనా ఏ రంగులోకైనా 
మారే ఒక స్వచ్ఛమైన గాలిలా నీరులా ఉండటం. 
అదీగొప్పతనం. అదీ అతి సహజం. 
=============================
డా ప్రతాప్ కౌటిళ్యా.
కామెంట్‌లు