నీటి చుక్కకు పేరు
వట్టి వాన చినుకే!
కృష్ణలో కురిస్తే కృష్ణ!
గంగలో కలిస్తే గంగ!
ప్రతి నదికి పేరు వేరే
ప్రతి నదిది దారి వేరే
ప్రతి ఒడ్డున కథలు వేరే
ప్రతి నీటి రుచి వేరే
సాగే ప్రతి ప్రవాహం
జీవుల దాహంతీర్చేదే!
ఏ చినుకు కురిసినా
ఏ వాగు పయనమైనా
ఏ ఏటి దారి అయినా
ఏ ప్రవాహం సాగినా
అన్నిటి పరుగులు
పల్లం ఉన్న వైపుకే...
వాన కురిసిన నీరు
వాగుగా మారి
వంకలతో చేరి
ఒకటై నదితో కూడి
చేరును కడలి ఒడి!
కడలిలో ఏ నీరు దేనిది?
కడలిని కలిసే నదిదే నీరు?
నదిని కలిసిన వాగుదేనీరు?
వాగులో కలసిన వంక లెన్ని?
వంకగా మారిన చినుకులేవి?
ఒకరొకరుగా వచ్చినా
వేరువేరుగా పెరిగినా
ఊరులన్నీ వేరైనా
దారులన్నీ వేరైనా....
చివరి పయనం ముగిసాక
చేరేది ఒకదరికే!
ఉన్న నాలుగు రోజుల్లో
ఎన్ని బాధలు వచ్చినా
ఎవరి కష్టం వారిదేగా!
సహకరించి సర్దుకుంటే
సహవాసం వుంటుందిగా!
సిరుల కన్నా మిన్న
సుఖజీవనమేగా!
🌸🌸సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి