గోవాలో సోమన్న "అమ్మ ప్రేమ" పుస్తక పరిచయ సభ


 నందవరం మండల పరిధిలోని జడ్పీహెచ్ స్కూల్ నాగలదిన్నెలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న బాలబంధు గద్వాల సోమన్న రచించిన  "అమ్మ ప్రేమ" పుస్తక పరిచయ సభ తాలెయిగావ్, గోవా, పనాజీ రాష్ట్రంలో ఘనంగా జరిగింది.  డా. జయరావు, విశ్రాంత సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ గద్వాల ఆనంద్, ఎల్డరు జి. కేశన్న మరియు విశ్రాంత పోలీస్ ఆఫీసర్ ఆర్.రాజప్ప  చేతుల మీదుగా మరియు విచ్చేసిన తెలుగు ప్రజలు సమక్షంలో  ఆవిష్కరించి, పుస్తకాన్ని పరిచయం చేశారు.అనంతరం శతాధిక గ్రంథకర్త గద్వాల సోమన్నను  సత్కరించారు. సన్మాన గ్రహీత, బాలగేయ బ్రహ్మ సోమన్నను శ్రేయోభిలాషులు, సాహితీ మిత్రులు అభినందించారు.
కామెంట్‌లు