పూటకూళ్ళమ్మ ఉపాహారాలు!: - పాలగుమ్మి జ్యోతి.
మల్లె పువ్వు లాంటి  ఇడ్లీలు 
మృదుత్వంలో దూదులు 
పొగలు కక్కుతూ ఆవిరులు 
కారంపొడితో మేళవింపులు!!



వేడి వేడి పెసరట్టు 
ఉప్మాతో జతకట్టు 
ఇంకోటంటూ పరుగెట్టు 
అదే దానిలో కనికట్టు!!

కరకరలాడే దోశలు
అల్లం,కొబ్బరి చట్నీలు  
రుచికి అందరూ జేజేలు 
మరి మరి కోరే జిహ్వలు!!

నూనెలో చేసి సవారి 
భలేగా పొంగిన పూరి 
చూడగానే దరికి జేరి  
తినాలనిపించు ఏరి కోరి!!

తీపిని కోరే ప్రియులు 
తినాలి పాకం గారెలు
బంగరు వర్ణం అందాలు 
కోనసీమ రుచుల ప్రతీకలు!!
============================
కామెంట్‌లు