డబ్బు : నక్క శ్రీకర్, ఊటూరు

 

 అందరినీ వేరు. చేస్తుంది బంధుత్వాలు విడదీ స్తుంది
గొడవలు పెట్టిస్తుంది
గర్వాన్ని పెంచు తుంది 
అది ఉంటే మానవులకు 
అహంకారం పెరుగుతుంది
అన్నదమ్ములకు చిచ్చు పెట్టిస్తుంది
కన్న తల్లి నీ దూరం చేస్తుంది
ఎన్నో అగాయిత్యలకు పాటు పడుతుంది
ఒకరికొకరిని వేరు చేస్తుంది 
తోడపుట్టినోల్లను పరాయివాల్లను చేస్తుంది
అది ఉంటే ప్రశాంతత లేదు 
అది ఉంటే ప్రేమలు,ఆప్యాయతలు,దూరమవుతాయి
అది మానవుడికి గొప్ప ఆయుధం 
మనిషికి అదే సమాజం లో విలువను పెంచుతుంది
అది గర్వాన్ని అహంకారాన్ని పెంచుతుంది.
అది ప్రశాంతతకు దూరం చేస్తుంది
అది ఉంటే నీతి గ బ్రతకడం మానేస్తాడు అందరినీ దోచేస్తాడు
సంపాదన ముసుగులో పడి తృప్తి లేకుండా చూస్తుంది
పుట్టినప్పుడు ఏమి తేము పోయేటప్పుడు ఏమి పట్టుకపోము 
కాస్తంత ఈ జీవితానికి అందరికీ దూరంగా చేస్తుంది ఈ డబ్బు
డబ్బు మాయలో పడి తల్లిని ,అలి నీ, కన్నపిల్లల్ని కూడా పట్టించుకోడు 
ఎప్పుడు సంపాదించాలనే ఆలోచన తెప్పిస్తుంది
స్వతంత్రంగా బ్రతకనివ్వడు ఈ డబ్బు
సంపాదించాలి కానీ కుటుంబం తో కొంత సమయం కేటయించాలి
ఎక్కువ సంపాదిస్తే ఎప్పుడు సంపాదించాలని ఉంటుంది
జీవితానికి తృప్తి లేకుండా చేస్తుంది ఈ డబ్బు 
డబ్బు శాశ్వతం కాదు నీ కుటుంబమే నీకు శాశ్వతం
సిరి సంపదలు మోజులో పడి నిజాయితీగా ప్రేమను దూరం చేస్తుంది ఈ డబ్బు
డబ్బు సంపాదించడం కాదు మంచి గుణం సంపాదించాలి
ప్రేమా ఆప్యాయత కావాలి కాని డబ్బే శాశ్వతం కాదు

కామెంట్‌లు