నాన్న అనే ఒక సామాన్య మనిషి
నాన్న అనే పదం వినగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది కుటుంబం.
కానీ ఆ కుటుంబం వెనుక నాన్న అని పిలిచే ఒక సామాన్య మనిషి ఉన్నా డని మనం చాలాసార్లు మర్చిపోతుం టాం.
ఆయనకూ కోరికలు ఉంటాయి. ఆయనకూ నచ్చిన విషయాలు ఉంటాయి. ఏమీ ఆలోచించకుండా ఒక్క రోజైనా హాయిగా నిద్రపోవాలనే ఆశ ఉంటుంది. తన కోసం ఒక వస్తు వు కొనుకోవాలనే కోరిక ఉంటుంది. ఎన్నో కలలు ఉండే వుంటాయి.
కానీ రోజులు గడుస్తున్న కొద్దీ, ఆయన 'నేను' అనే జీవితం మెల్లమెల్లగా 'మనం' అని మారిపోతుంది.
పిల్లల బడి ఫీజులు, ఇంటి ఖర్చులు, వైద్య ఖర్చులు, భవిష్యత్తు అవస రాలు...
వీటన్నింటి మధ్య ఆయన సొంత ఆశలు చాలా వరకు “తర్వాత చూసుకుందాం” అనే మూలన పడిపోతాయి.
ఆయనకు అలసట రాదనుకుం టాం. ఆయనకు ఏ బెంగా ఉండదను కుంటాం. ఆయన దేన్నైనా తట్టుకుని నిలబడతాడనుకుంటాం. కానీ నాన్న కూడా ఒక మనిషి.
కొన్ని రోజుల్లో ఆయనకూ ఎవరి తోనైనా మనసు విప్పి మాట్లాడా లనిపిస్తుంది.
కొన్నిసార్లు “అంతా సర్దుకుంటుందిలే” అని ఎవరైనా తనకు ధైర్యం చెప్పాలని పిస్తుంది.
కొన్ని ఓటముల్లో ఆయన కూడా మనసారా కుంగిపోయి ఉండవచ్చు.
కొన్ని రాత్రుల్లో వచ్చే నెల ఖర్చులు ఎలా గడుస్తాయో అని ఒంటరిగా దిగులుపడి ఉండవచ్చు.
కానీ మరుసటి రోజు ఉదయాన్నే ఏమీ జరగనట్టు లేచి కుటుంబం కోసం మళ్లీ పరుగు తీస్తూనే ఉంటాడు.
నాన్న ప్రేమ ఎప్పుడూ మాటల్లో బయటపడదు.
కొన్నిసార్లు అది పొద్దున్నే లేచి ఉద్యోగానికి వెళ్లడంలో కనిపిస్తుంది.
కొన్నిసార్లు తనకు నచ్చినదాన్ని వదులుకుని పిల్లలకు నచ్చినట్లు కనిపించడం లేదు.
కొన్నిసార్లు “నాకొద్దులే” అని చెప్పే చిన్న అబద్ధంలో కనిపిస్తుంది.
వయసు పెరిగే కొద్దీ అర్థమవుతుంది...
నాన్న మన కోసం చేసిన ఎన్నో పనులకు ఆయన ఎప్పుడూ ప్రశంసలు ఆశించలేదు.
ఆయన్ని కేవలం ఒక తండ్రిగానే కాకుండా, ఒక మనిషిగా కూడా చూడాల్సిన సమయం ఇది.
ఆయన శరీరానికీ విశ్రాంతి కావాలి. ఆయన మనసుకూ ప్రశాంతత కావాలి. ఆయన జీవితానికి కొన్ని ఆశలు కావాలి.
నాన్న అంటే కేవలం కుటుంబం కోసం బతికే ఒక పాత్ర మాత్రమే కాదు.
ఆయనకూ ఒక జీవితం ఉంది.
ఒక పిల్లవాడు తన తండ్రిని “నాన్న” అని పిలవడానికి ముందే, ఆయన ఒకరి కొడుకుగా ఉన్నాడు, ఒకరి స్నేహితుడిగా ఉన్నాడు, ఒక యువకుడిగా ఎన్నో కలలు కన్నాడు.
ఆ మనిషిని కూడా కొంచెం అర్థం చేసుకుందాం.
నాన్న అంటే కుటుంబానికి కేవలం ఒక ఆధారమే కాదు... ఆధారానికి కూడా కొన్నిసార్లు కాస్త సేద తీరడానికి ఒక తోడు కావాలి! ఏమంటారు?!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి