గురుదేవులకు సదా శిరసొంచి వందనం: - బి.ఉషారాణి-మంచిర్యాల


బ్రతుకుకు బాటను వేసి
చీకట్లను దూరం చేసి
జ్ఞాన దీపాలను వెలిగించి
దారి చూపేది గురువే కదా!

విద్యార్థుల తప్పులను సరిదిద్దుతూ
వ్యక్తిత్వానికి పునాదులు వేస్తూ
భవిష్యత్తుకు బంగారు బాట వేస్తూ
వారి ఉన్నతికి పరితపించేది ఆచార్యుడే కదా!

శిష్యుల ప్రగతిని చూసి సంబరపడుతూ
తనకన్నా శిష్యులే గొప్పగా ఎదగాలని కోరుతూ
వారి విజయాలను తన విజయాలుగా భావిస్తూ
మురిసిపోయే నిస్వార్థ జీవి గురువే కదా!

తల్లి అనురాగం, తండ్రి లాలనను  చూపిస్తూ
మార్గదర్శిగా మారి  క్రమశిక్షణ నేర్పిస్తూ
పతనం వైపు అడుగులు పడనీయక
బాలలను పరిరక్షించేది ఉపాధ్యాయుడే కదా!

అందుకే అన్నారు మరి పెద్దలు
గురుర్ బ్రహ్మా… గురుర్ విష్ణుః… 
గురుర్ దేవో మహేశ్వరః…
గురుః సాక్షాత్ పరబ్రహ్మ… 
తస్మై శ్రీ గురవే నమః! అని
అట్టి గురుదేవులకు సదా శిరసొంచి వందనం
కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
Nice
అజ్ఞాత చెప్పారు…
👌👌