సర్వేపల్లి స్పూర్తి: -రచన, గానం:- కుదమ తిరుమలరావు


టీచరై- మన మాస్టరై సర్వేపల్లి స్ఫూర్తిని నింపారు
టీచరై- గురుబ్రహ్మవై రాధాకృష్ణన్ కీర్తిని నిల్పారు 
అనునిత్యం సాధనతో భారత రాష్ట్రపతయ్యారూ


తమిళనాట తిరువళ్ళూరు తిరుత్తణిన జన్మించీ
వీరాస్వామి, సీతమ్మలకు ధన్యతనే చేకూర్చీ 
భారత రాజ్యాంగ పరిషత్ సభ్యునిగా కృషి సల్పీ
తరతరాలకూ నిలిచేలా- తత్వవేత్తగా వెలసీ 


సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మించిన ఈరోజు
వృత్తి వైశిష్ట్యానికి మారుపేరు ఈవేళ
లక్షలాది గురువులకంటూ లక్ష్యాలను నిర్దేశించి
ఉపాధ్యాయుడే ఈ భువిలో బహు కీలక వ్యక్తని చాటీ 


రత్నమంటి రాధాకృష్ణన్ భారతరత్నగా మెరిసీ
ఆధ్యాత్మిక మత గ్రంథాల్ని ఔపోసన గావించీ 
పండితుడై ప్రజ్ఞను చాటీ స్వాతంత్ర్యం సాధించి
మానవతే ముఖ్యం అంటూ ప్రబోధించే పాఠ్యాంశాలు 


గుర్రపు బగ్గీ పైన సర్వేపల్లి సారుని ఉంచీ
గుర్రాలను తప్పించేసీ అతనిని శిష్యులు మోసీ 
మైసూరు స్టేషను వరకూ విద్యార్థులే బగ్గీలాగీ
మైసూరు స్టేషను వరకూ విద్యార్థులే బండిని లాగీ 
ఆచార్యదేవోభవ అని చాటింది నీ చరిత

---------

రచన, గానం:- 
కుదమ తిరుమలరావు
సాంఘిక శాస్త్రోపాధ్యాయులు ఎంపియుపి పాఠశాల పాలఖండ్యాం శ్రీకాకుళం జిల్లా 
-------

జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ రాష్ట్రపతి పురస్కార గ్రహీత-2009

9505665748.
కామెంట్‌లు