నవభారత నిర్మాత నరేంద్రమోడి: - ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్ - (పుష్యమి)-సెయింట్ లూయిస్ - అమెరికా.


మానవత్వమే మాధవత్వమని 
ప్రేమ తత్వమే ముముక్షత్వమని 
ప్రజాహితమే నా ధ్యేయమని 
విద్య, వైద్యం అందరికీ అందుబాటులో ఉండాలని 
స్త్రీ సంక్షేమమే సమాజ కళ్యాణమని 
అనేక  ప్రజాసంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టిన 
ప్రజా బంధు మోడీ మీరు ప్రజల పాలిట శ్రీరామచంద్రులే.!

దేశానికి వెన్నుముక రైతులని 
రైతుబంధు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి 
ఆనాడు జాతిపిత మహాత్ముడు చెప్పినట్లు 
గ్రామ అభివృద్ధియే దేశ అభివృద్ధని రైతే రాజు అన్న స్వప్నాన్ని సాకారం చేసిన సమాజ హితులు మోడీ.!

శాస్త్ర సాంకేతిక విజ్ఞాన రంగాలలో 
భారత్ ను అగ్రగామి దేశాల సరసన నిలిపి
అంతరిక్ష పరిశోధనలతో
అంతర్జాతీయ ఖ్యాతిని గడించి 
పుల్వామా సంఘటన మరియు పహల్గాం సంఘటనలకు వ్యతిరేకంగా 
సైనిక చర్యలతో శత్రువులను తుద ముట్టించి 
కరోనా చేసిన మరణ మృదంగాన్ని అడ్డుకొని 
ఇతర దేశాలకు కు కూడ వెన్నుగా నిలచి 
'ధర్మో రక్షతి రక్షితః 'అన్న సనాతన ధర్మానికి వారధిగా 
పతంజలి యోగాసనాలే
ఆరోగ్య జీవనానికి సోపానాలని
అంతర్జాతీయ యోగా దినోత్సవం కి కారణమై 
భారతీయుల ఎన్నో ఏండ్ల కల 
అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని నిర్మించి 
భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్లు స్థితప్రజ్ఞతకు దర్పణంగా 
పన్నెండు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా 
పదమూడు సంవత్సరాలు ప్రధానమంత్రిగా 
మొత్తం ఇరువది ఐదు సంవత్సరాలు ప్రజానాయకునిగా
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తు
వసుదైకాన కీర్తింపబడిన
ప్రధాని నరేంద్ర మోడీ 
మీరు నవభారత నిర్మాతలే 
మీ రజతోత్సవ సుపరిపాలన సందర్భంగా 
అందుకోండి 
మీ జన్మదినాన సమర్పిస్తున్న నా అక్షర కుసుమాలు ..!!

    వందేమాతరం 
   భారత మాతాకీ జై !

(సెప్టెంబర్ 17 ప్రధాని నరేంద్రమోడీ జన్మదిన సందర్భంగా వ్రాసినది)
............................

కామెంట్‌లు