నిండు గర్భిణీ అయిన భార్యకు కానుపు సజావుగా అయ్యి తల్లీ బిడ్డ క్షేమంగా ఉండాలని కంగారు పడుతున్న భర్త.
వచ్చిన దిగుబడికి సరైన ధర వస్తుందో రాదో అని కంగారు చూపులు చూస్తున్న రైతు.
తాకట్టు పెట్టిన బంగారం వాకట్టు కాకుండా సకాలంలో డబ్బులు కట్టాలని కంగారుగా ప్రయత్నాలు చేస్తున్న సగటు జీవి.
ఆరోగ్య పరీక్షలు చేయించుకుని ఫలితం కోసం కంగారుగా ఎదురుచూస్తున్న వ్యాధిగ్రస్తుడు.
పెళ్ళిలో వియ్యాలవారికి ఏలోటూ రాకూడదని, వారితో మాట పడకూడదని అందరినీ కంగారు పెడుతున్న ఆడపిల్ల తండ్రి.
బయటికి వెళ్ళిన కూతురు సమయం మించి పోతున్నా ఇంటికి చేరకపోయేసరికి కంగారుగా ఫోను చేస్తున్న తల్లి .
ఎవరూ చూడకుండా కంగారుగా లంచం డబ్బులు జేబులో కుక్కుకుంటున్న లంచావతారం.
పరీక్షలలో పిల్లవాడు ప్రథమ స్థానం పొందాడా? లేదా? అని ఫలితాలను కంగారుగా వెతుక్కుంటున్న తల్లిదండ్రులు.
హామీ :ఎటువంటి కంగారు లేకుండా ఇస్తున్నా, ఇది నా స్వీయ రచన.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి