ఎక్కడ చేసిన అదే
ఇంట్లోనైనా అదే బయట అయినా అదే
ఎక్కడ చూసినా వ్యర్థాలే
ఏ మూలలో ఆయన అదే
తినే ప్లేటు అదే కూర్చోనే కుర్చీ అదే
తాగే గ్లాసు అదే తోముకొనే బ్రెష్ అదే
ఈ జీవితంలో అదొక భాగస్వామ్యం అయిపోయింది
అది లేని ఇల్లు లేదు అది లేని స్థలం లేదు
ప్రపంచమంతటా ఎక్కడ చూసినా అదే అదే
ప్రకృతి ని నాశనం చేసేదదే
మనకు రోగాలు తెచ్చేది అదే
దాన్ని తింటున్నాం దాన్ని తాగుతున్నాం
దాన్ని కొనుక్కొని వాడి
ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాo
అదే రాజ్యమేలుతుంది
నేల సారవంతం కోల్పోతుంది
కాలం కానీ కాలం లో వైపరీత్యాలు
భూమిని పాడుచేస్తుంది
జీవులను బ్రతకకుండా చేస్తుంది
ప్రపంచంలో ఇది పెరిగిపోతుంది
గోవులు తిండి లేక ఇవి తింటున్నాయి
వాటి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు
వాడొద్దు ఈ పదార్థం
తెచ్చుకో వద్దు ఈ రకమైన రోగాలు
సాధించాలి ప్లాస్టిక్ రాహీత ప్రపంచo
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి