నా ప్రవృత్తి కవిత్వం: - బి.ఉషారాణి- Govt టీచర్-మంచిర్యాల


నా ప్రవృత్తి కవిత్వం
అక్షరాలతో చెలిమి చేస్తూ
మనసులోని భావాలకు
అందమైన పదాల కూర్పునిస్తూ
సుందరమైన కవితలుగా మలచడం
నాకు చాలా చాలా ఇష్టం

ప్రకృతి సోయగాన్ని చూసి మురిసినా
పూల పరిమళాలను ఆస్వాదించినా
నిండు పున్నమి వెన్నెలను గాంచినా
హరివిల్లులకు వానజల్లులకు మది పులకించినా
నా కలం జలపాతపు ఉరవళ్లెత్తుతుంది

సంతోషమైనా సంతాపమైనా
సందేహమైనా సందేశమైనా
అన్నీ నా పదాలలో ఇమిడి కవితలౌతాయి
నా మదిలోని ఆలోచనను ప్రతిబింబిస్తాయి

అనురాగమయినా అనుబంధమయినా 
చెలిమినయినా ఆత్మీయతనయినా
నా మదిలోని ఏ భావననయినా
అలా కవితలుగా అలవోకగా అల్లేస్తూ
నన్ను నేను మరిచిపోతాను
ఆ కవితలలో నన్ను నేను వెతుక్కుంటాను
కామెంట్‌లు