1 ఒకటవ సర్గ ( 2 ): - ఎడ్ల లక్ష్మి


ఓ ఆర్యా! ఉత్సాహమే నిజమైన బలము 
ఉత్సాహవంతులెట్టి కార్యమునైన జయించగలరు 
మనము నిరుత్సాహానికి గురి కాకుండా 
ముందుకు సాగినచో వదిన తప్పక లభించును

అన్నా! నీవు మిగుల ధైర్యశాలివి 
నీ లోని శోకమును ప్రారదోలుము 
శ్రీరాముడు మనసును దిటవు చేసుకొని 
లక్ష్మణునితో గూడి ముందుకు సాగెను.

శ్రీరాముడు లక్ష్మణునితో గూడి చెట్లు గుట్టలు
వనములు, నదులు సీతకై వెతుకుచుండెను 
ఎంత వెతికినా ఆమెజాడ తెలియకుండెను
అందులకు శ్రీరాముడు మిగుల దుఃఖితుడాయెను 

అచట సుగ్రీవుడు  రామలక్ష్మణులను చూచి 
అతడు పెక్కు భయముతో నిశ్చేష్టుడై
మీగుల భయంతో వనికిపోవుచు
చింతాక్రాంతుడై విచారించుచుండెను

ఆ ప్రాంతమంతా మతంగఆశ్రమప్రదేశమే 
పరమ పవిత్రమైనది సుఖప్రదమైనది 
ఆశ్రమము వారి నివాసముగా చేసుకొనిరి 
రామలక్ష్మణులను చూచి ఆశ్రమములోకి పరుగెత్తెను. 
======================================
కిష్కింధా కాండ మందు మొదటి సర్గ సమాప్తము.
కామెంట్‌లు