ప్రవాస పద్య పరిమళం - 131: - - వెంకట్ కొత్తూర్ Ashburn VA USA
 నేటి అంశం : దత్త పది 
పదములు : “ఏరు - పారు - ఊరు - మారు “ పదములు  ఇదే వరుసలో, ప్రతి పాదములో మొదటి పదముగా 

విషయం : పల్లెటూరు అందాలు 


ఛందస్సు : మత్త కోకిల 

(ఏరు)వాకను స్వాగతించగ నెంత  మోదము రైతుకున్ 
(పారు)చుండగ చిన్ని  కాల్వలు పంట చేలను  తాకుచున్
(ఊరు) వాడల చేతనత్వపుటుప్పెనల్చిరు గంటలై 
(మారు) మ్రోగెను గోవు గోదల మంద పల్లెకు నందమై 
కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
Adbhutham sir 👌👌👌