"అదృశ్య వీరుడు"జానపద నవల3️⃣5️⃣✅వ భాగం బాగం.: నాగమణి రావులపాటి.
 

అలాగే మిత్రమా! నీ దయవలన నాకు ఈ ఖడ్గం సంప్రాప్తమైనది. నీ సహాయం లేకపోతే ఇంతదూరం రాగలిగే వాడిని కాదు. నీకు అనేక ధన్యవాదాలు పక్షిరాజా!" అని పలికాడు.
"అంతా దైవేశ్చ! ఒక మంచి కార్యానికి సహాయపడటం ఎంతో పుణ్యఫలం. అది నీ ద్వారా నాకు దక్కింది. ఇక నిన్ను నీ లక్ష్యానికి చేరుస్తాను" అని తన వీపు చూపింది.
జయసేనుడు దానిని అధిరోహించాడు. కన్నుమూసి కనులు తెరిచేసరికల్లా ఆకాశానికి ఎగిరింది. తన సునిశిత నేత్రాలను నేలపై పరిచి ఆగమేఘాల మీద ఆ వక్రమల్లు పంచప్రాణాల నివాస దరిదాపుగా నేలపై దిగింది.
"ఓ కుమారా! అదే నీవు చేదించాల్సిన మాయామయ స్థావరం. నీ ఆత్మస్థైర్యం, మనోబలం, అఖండ సాహసం చూపించాల్సిన తరుణం రానే వచ్చింది. నేను ఈ స్థావరం దాటి ప్రయాణించాల్సి ఉంటుంది. నేను తిరిగి రావడానికి రెండు మూడు రోజులు పడుతుంది. ఈలోపల ఆ దైవం అనుకూలించి నీ కార్యం నెరవేరితే నిన్ను వక్రమల్లు రాకుమారిని బంధించిన ప్రదేశానికి చేర్చగలను. నీకోసం మరోరోజు ఇక్కడే ఎదురు చూస్తాను. నీవు రాని పక్షంలో నేను వెళ్లిపోతాను. జాగరూకతతో మెలగాలి. ఇక్కడ ప్రతి క్షణం ఎంతో విలువైనది. నీకు జయమగుగాక!" అని పలికి జయసేనుడు చూస్తుండగానే రివ్వున ఆకాశంలోకి ఎగిరి కనుమరుగైపోయింది.
"ఈ గండాబేరుండునిది ఎంత వేగం! అతను హెచ్చరించినట్లు చాలా మెలకువతో మెలగాలి" అని మనసులో తలంచినవాడై ఆ మాయామయ ప్రదేశం వైపు అడుగులు వేయనారంభించాడు జయసేనుడు.
సశేషం...
కామెంట్‌లు