అట్టి రాముని తో నీకేమి ప్రయోజనము?
నేను సమస్త రాక్షసులకు ప్రభువును
నీపై మరులు పెంచుకొని ఇటు వచ్చితిని.
ఓ సుందరీ! మానవ మాత్రుడైన రాముని
పరాక్రమము నా కాలిగోటికి సరితూగదు
నీ అదృష్టం కొలది నేను నిన్ను చేరితిని
ఓ జానకీ! నీవు నన్ను స్వీకరింపుము.
రావణుని పలుకులకు సీతకృద్ధురాలై
ఓ రావణా! నీవు పాపివి దుష్టుడవు,
నీ బుద్ధి పెడదారి పట్టింది నీకు చావు తప్పదు
నిన్ను రాజుగా పొందిన రాక్షసులు చచ్చెదరు
ఎవడైనను ఇంద్రుని భార్య అయిన శచీదేవిని
అపహరించి ప్రాణాలతో మిగిలియుండునేమో
శ్రీరాముని భార్యనైన నన్ను అపహరించినవాడు
తన ప్రాణాలపై ఆశ వదులుకోవలసినదే.
ఓ రాక్షసా! సౌందర్యవతి అయిన సచీదేవిని
ఇంద్రుని ఆధీనం నుండి లాగు కొనిపోయి
జీవించియుండవచ్చునేమోగాని
నన్ను కష్టపెట్టి అమృతము త్రాగినను
మరణము నుండి తప్పించుకునలేవు.
===================================
అరణ్యకాండమందు 48 వ సర్గ సమాప్తము.🙏🏻

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి