రావణుడు రాక్షసరూపమును పొంది ఆమెను రథముపై తీసుకొని
ఆకాశమార్గమున బయలుదేరుట.
ఆమెతో గట్టిగా గర్జిస్తూ ఇలా పలికెను
ఓ సీతా! నీవు నీ పతివ్యామోహంలోబడి
నా శౌర్యపరాక్రమముల గూర్చి విన్నట్లులేదు
ఓ ఉన్మత్తురాలా! నేను ఆకాశమునుండి
నా భుజబలముచే భూమండలమును
పైకెత్తగలను సముద్ర నీరు త్రాగగలను
మృత్యుదేవతను సైతము చంపగలను
క్రుద్దుడైన రావణుని కళ్ళు ఎర్రభారెను
వెంటనే కుబేరుని సోదరుడైన రావణుడు
సౌమ్యమైన బిక్షువేషమును పరిత్యజించి
భయంకరమైన తన రూపమును దాల్చెను.
దశకంఠుడు సీతాదేవితో ఇట్లు పలికెను
ఓ సీతా! నీకన్నివిధముల తగిన భర్తను నేనే!
ఓ కళ్యాణీ! కలకాలము నాతో ఉండిపొమ్ము
రాముని పై వ్యామోహము త్యజింపుము.
సీతాదేవి జుట్టును ఎడమ చేతితో
ఆమె పాదాలను కుడి చేతితోను పట్టుకొనెను
ఈ దృశ్యము చూసిన ఆ వనదేవతలు
భయగ్రస్తులై పరుగులు దీసిరి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి