మయుడు మాయస్త్రీవలె అంతాఃపురమున ఉంచెను
నా అనుమతి లేకుండ ఎవరీమెను చూడరాదని
రావణుడు రాక్షసస్త్రీలను ఆదేశించెను.
రావణుడు రాక్షస స్త్రీలను ఆదేశించిన పిదప
అంతఃపురమునుండి వెలుపలికి వచ్చి
మాంస భక్షకులైన ఎనిమిది మంది రాక్షసులను
రావణుడు తన చెంతకు పిలిచి ఇట్లనెను.
ఓ రాక్షసయోధులారా! మీరు సాయిదులై
వెంటనే జనస్థానమునకు వెళ్ళుడు
అది ఇదివరకు ఖరుని ఆధీనములో ఉండెను
అతడు శ్రీరాముని చేతిలో హతడైనాడు.
మీరు జనస్థానమున నివసించుచు
రాముని కదిలికల గూర్చియు గమనిస్తూ
ఆయన తలపెట్టే ప్రయత్నాలను
ఎప్పటికప్పుడు నాకు తెలియజేయుడు
రావణుడు సీతాదేవిని అపహరించుకొచ్చి
రాక్షసస్త్రీలరక్షణలోనుంచి సంతృప్తుడైయ్యెను
శ్రీరామునితో బద్ధవైరము ఏర్పడినప్పటికిని
మోహవశమున అతడు పొంగిపోయెను.
=======================================
అరణ్యకాండమందు 54వ సర్గ సమాప్తము.🙏🏻

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి