రావణుడు సీతాదేవితో లంకకు చేరుట, ఆమెను అచట రాక్షస స్త్రీల రక్షణలో నుంచు.
ఆమెను ఆదుకొనుటకు ఎవరు కానరారు
ఆమె రథముపైనుండి కిందికి చూడగా
పర్వతశిఖరముపై అలజడి వినబడెను.
సీతాదేవి తదేకముగా అటుచూడగా
అయిదుగురు వానర ప్రముఖులు
ఆమె కంటపడిరి వెంటనే సీతాదేవి
కోకను చింపి నగలు మూటగట్టి క్రిందికి విసిరెను.
అచట ఉన్న ఆ వానర ప్రముఖులు
దూరముగా ఉన్న వస్తువులను చూచి
వ్యక్తులనుగాని స్పష్టముగా చూడగలరు
రథము పైనున్న సీతాదేవిని వారుచూచిరి.
రావణుడు సీతనపహరించుకొని వచ్చుట
సముద్రుడు చూచి మిక్కిలి క్షోభపడెను
తరంగములు సుడులు దిరిగెను
అందలి సర్పములు భయముతో దాగెను.
సీతాదేవి రావణుడిని తప్పించుకొనుటకు
మిక్కిలిగా పెనుగులాడుచుండెను
అచట అతడు తన పాలిట మృత్యువై
రథమున బంధించి లంకలో ప్రవేశించెను.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి