59వ సర్గ : ( 2 ): - ఎడ్ల లక్ష్మి
అన్నా! నేను వదినకు ఎంత

 ధైర్యము చెప్పినా గాని 
వైదేహి భ్రాంతికి లోనై కన్నీరుగార్చుచు
అతిధారణముగా నాతో ఇట్లనెను. 

'మీ అన్న అసువులను వీడినచో 
నీవు నన్ను పొందవలెననెడి
పాపపు బుద్ధి నీలో గూడు కట్టుకొని యున్నది 
ఎట్టి పరిస్థితిలోనూ నీవు నన్ను పొందలేవు. 

శ్రీరామునితుదముట్టింపుమని భరతుడు 
సూచించియుండవచ్చు అందుకే నీవెళ్ళుటలేదు  
నీవు మారువేషములో ఉన్న శత్రుడవు 
నా కొరకే నీవు మాతో వచ్చావని ఆమె పలికెను.

వదినె అన్న మాటలకు మిక్కిలి దుఃఖిస్తూ 
ఆశ్రమము నుండి బయలుదేరి వచ్చితిని 
లక్ష్మణుని మాటలకు శ్రీరాముడు పరితపించి 
నీవు ఆమెను వదిలి వచ్చుట చాలా తప్పు .

సీత పలికిన కఠిన వచనములకు 
నీవు క్రుద్దుడవై నా ఆజ్ఞను ఉల్లంఘించితివి \
నా కంఠమును అనుకరించిన ధ్వని నాది కాదని తెలిసి 
నీవు మైథిలిని అచట వీడి ఇటు వచ్చితివి. 

===================================

అరణ్యవాసమందు 59వ సర్గ సమాప్తము.🙏🏻
కామెంట్‌లు