69వ సర్గ : ( 2 ): - ఎడ్ల లక్ష్మి


వారు అరణ్యమున నడుచుచు వెళ్తుంటే 
వారికి కబంధుడను రాక్షసుడు ఎదురుపడెను 
అతడు తన పొడవైన చేతులతో  
రామలక్ష్మణులను గట్టిగా పట్టి లాగెను 

రామలక్ష్మణులు వాడి చేతిలోన చిక్కినారు 
లక్ష్మణుడు భీతి చెందుచుండెను
కబంధుడు పెద్దగా గర్జించుచు 
రామలక్ష్మణులను ఇట్లు అడిగెను 

ఓ యువకుల్లారా మీరు ఎవరు? 
ధనుర్భావణములను ధరించి
మీరు ఇచ్చటికి ఎలా వచ్చితిరి? 
మీరు నాకు ఆహారముగా చిక్కితిరి.
 
ఇక మీ జీవితము ముగిసినట్లే
కబంధు నీ మాటలు విని శ్రీరాముడు 
లక్ష్మణునితో ఇట్లు అనుచు బాధపడను 
ఎంత వెతికినా సీతాదేవి కనబడలేదు కదా! 

ఇప్పుడు మన ప్రాణములకే ముప్పు ఏర్పడినది 
అగ్రజా వీడు ఇసుక కట్టతో సమానము 
మనము శాస్త్ర విద్యలలో ఆరితేరిన వారము 
లక్ష్మణుని మాటలిని రాముడు ధైర్యముగా యుండెను.

అరణ్యకాండమందు 69వ సర్గ సమాప్తము.🙏🏻
కామెంట్‌లు