70వ సర్గ : - ఎడ్ల లక్ష్మి
కబంధుడు రామలక్ష్మణులను భక్షించుటకు సిద్ధపడుట - 
సమయస్ఫూర్తితో వారు అతని బాహువులను ఖండించి వేయుట. 




తన చేతిలో చిక్కియున్న రామలక్ష్మణులను 
కబంధుడు వారితో ఇట్లు అనుచుండెను 
ఓ క్షత్రియ శ్రేష్టులారా! నేను ఆకలితో యుంటిని 
దేవుడు మిమ్మలను నాకు ఆహారముగా పంపినాడు .

రాక్షసుని మాటలు విని లక్ష్మణుడు దుఃఖించుచు 
అన్నా! అతడు మనలను తినేయకముందే 
మనము ఖడ్గములతో ఇతని పొడవైన 
బాహువులను ఖండించి వేయుదాము.

ఆ రాక్షసుడు వారి మాటలను విని క్రుద్ధుడై
వారిని భక్షించుటకై తన నోరు తెరువగా
కుడి భుజమును రాముడు ఖండించెను 
ఎడమ భుజమును లక్ష్మణుడు ఖండించెను. 

ఆ దానవుడు నెత్తుటి మడుగులో దోగుచు 
తెగిపడియున్న తన చేతులను జూచి 
దుఃఖితుడై మీరెవరు? అని ప్రశ్నించెను.
లక్ష్మణుడు కబంధునకి వారి గూర్చి తెలుపెను

మా వదినయగు వైదేహిని రాక్షసుడు అపహరించెను 
ఆమెను వెతుకుచు మేము ఇచటికి వచ్చాము.
ఓ పురుష శ్రేష్ఠులారా మీకు స్వాగతము
ఓ నారశ్రేష్ఠా! నా పూర్వ గాథ గూర్చి తెలుపెదను వినుడు. 

------------------------------------------------------------------
అరణ్యకాండమందు 70వ సర్గం సమాప్తము. 🙏🏻
కామెంట్‌లు