ఆదర్శ ఉపాధ్యాయుడు: శరణ్య. నేను 8వ తరగతి . .ఎడపల్లి, నిజామాబాద్ జిల్లా.
 

ఒకరోజు మా తరగతికి మా తెలుగు ఉపాధ్యాయులు శ్రీ బొడ్డు భరద్వాజ సార్ (స్కూల్ అసిస్టెంట్, ప్రాథమికోన్నత పాఠశాల అంబం, ఎడపల్లి) గారు వచ్చారు. ఆయన మాకు 'చంద్రశేఖర్ రావు' అనే గొప్ప ఉపాధ్యాయుని గురించి చెప్పారు. మొదట్లో నాకు పెద్దగా ఆసక్తి అనిపించలేదు. కానీ భరద్వాజ సార్ ఆయన గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు చెబుతుంటే వినాలనే కుతూహలం పెరిగింది. ఆయన చెప్పిన విషయాల స్ఫూర్తితో చంద్రశేఖర్ రావు గారి గురించి ఈ కథ రాస్తున్నాను.
చంద్రశేఖర్ రావు గారి స్వస్థలం నిజామాబాద్. ఆయన నిజామాబాద్‌లోని వెంకటేశ్వర విద్యాలయంలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఆయన తన విద్యార్థులను ఎంతో ప్రేమగా చూసుకునేవారు. ప్రతి పిల్లవాడు బాగా చదువుకుని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకునేవారు. పిల్లలకు కేవలం పాఠాలు చెప్పడమే కాకుండా కష్టపడి చదవడం, నిజాయితీగా ఉండటం, సత్ప్రవర్తన వంటి విలువలను నేర్పించేవారు. చదువులో వెనుకబడిన పిల్లల కోసం ప్రత్యేక సమయం కేటాయించి, వారికి అర్థమయ్యేలా పాఠాలు చెప్పేవారు.
సార్ చెప్పిన మాటలను విద్యార్థులు శ్రద్ధగా పాటించారు. ప్రతిరోజూ కష్టపడి చదివి మంచి మార్కులు సాధించారు. కొంతకాలానికి ఆ విద్యార్థులు మంచి ఉద్యోగాలు పొంది జీవితంలో గొప్ప స్థాయికి ఎదిగారు. వాళ్లు తమ విజయానికి కారణం చంద్రశేఖర్ రావు సార్ అని గర్వంగా చెప్పుకునేవారు. "మాకు చదువుతో పాటు జీవితాన్ని ఎలా గెలవాలో నేర్పింది మా సార్" అని ఆయనను ఎంతో గౌరవించేవారు.
ఇలా ఉండగా ఒకరోజు చంద్రశేఖర్ రావు గారు బస్టాండ్‌లో నిలబడి ఉన్నారు. అప్పుడు ఒక కానిస్టేబుల్ వచ్చి, "మా సీఐ గారు మిమ్మల్ని రమ్మంటున్నారు" అని చెప్పి ఆయనను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లాడు. అక్కడ సీఐ గారు, చంద్రశేఖర్ రావు గారిని ఎంతో మర్యాదగా కుర్చీలో కూర్చోబెట్టారు. ఆశ్చర్యపోయిన సార్, "నన్నెందుకు కుర్చీలో కూర్చోబెడుతున్నావు బాబూ?" అని అడిగారు.
అప్పుడు ఆ సీఐ నవ్వుతూ, "సార్, నన్ను గుర్తుపట్టారా? నేను మీ స్టూడెంట్‌ని. మీరు చెప్పిన మాటలు విన్నాను కాబట్టే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను" అన్నాడు. అప్పుడు చంద్రశేఖర్ రావు సార్ తాను చదువు చెప్పిన విద్యార్థి ఆ స్థాయిలో ఉన్నాడని చూసి కళ్ళలో నీళ్లు తెచ్చుకున్నారు.
నీతి: మంచి గురువు చెప్పే మాటలు విద్యార్థుల జీవితాన్ని మారుస్తాయి. గురువును గౌరవించి, కష్టపడి చదివితే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు.
కామెంట్‌లు
Popular posts
ఈ కబుర్ల పేరేంటో?: అనురాధ బొడ్ల (సముద్రాల)-9989566696
చిత్రం
ఏది డ్యూటీ? : -అనురాధ బొడ్ల (సముద్రాల)-9989566696
చిత్రం
తప్పూ మంచిదేనేమో!: - అనురాధ బొడ్ల (సముద్రాల)-9989566696
చిత్రం
సుమతీ శతకం ౪౫(45)వ పద్యం. తల మాసిన నొలు మాసిన ఒలువలు మాసినను బ్రాణ వల్లభునైనన్ గులకాంతలైన రోఁతురు దిలకింపఁగ భూమిలోన దిరముగ సుమతీ! తా : ఓ మంచి తెలివి గల బుద్ధిమంతుడవైన, సుమతీ .... ఈ ప్రపపంచంలో, భర్త ఎంత అందగాడు ఐనా, తైల సంస్కారం లేని జుత్తుతో, శుభ్రం చేసుకోని దేహంతో, మాసిపోయి, దుర్గంధం వెదజల్లతున్న వస్త్రాలతో వుంటే కులస్త్రీలు కూడా ఆతనిని చూడటానికి ఇష్టపడరు. ఇది నిజంగా నిజము............. ....అని సుమతీ శతకకారుని వాక్కు. *ఈ పాంచ భౌతికమైన ప్రపంచంలో, నిత్యము, సత్యము ఐన ఆత్మ సౌందర్యం కంటే అనిత్యము, అసత్యము ఐన బాహ్య సౌందర్యానికే ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వబడుతోంది.* *కానీ ప్రతి ఒక్కరూ, తమలోనే వున్న నేనుతో పరిచయం చెసుకుని, పెంచుకుని, పరమాత్ముని తో స్నేహం చేస్తూ ప్రయాణం చేయాలని భావం.* ....ఓం నమో వేంకటేశాయ Nagarajakumar.mvss
చిత్రం