ప్రచేతస కుమారుడై,
రత్నాకరుడుగా జననం!
బాల్యం బోయ వాళ్ళ,
పెంపక కారణం!
విలువిద్యలో పట్టుపడె,
అపార నైపుణ్యం!
కుటుంబ పోషణ దారిదోపిడి,
లేదు, రవ్వంత కారుణ్యం!
ఓ రోజు నారదున్ని సైతం,
దోచే దారుణ యత్నం!
నారద ప్రశ్న," నీ పాపం నీ,
కుటుంబం పంచుకుంటుందా?"
కుటుంబమిచ్చినసమాధానం,
అతనికి అశనిఘాతం!
రత్నాకరుడు కళ్ళు తెరవడం,
మార్పుకు అదే మూలం!
పశ్చాత్తాపాన నారద ,
పాదాల శరణు వేడడం!
మర ,మర నారద,
మంత్రోపదేశం, జన్మ సుకృతం!
దీర్ఘకాలం చేసే మననం,
చుట్టూ వల్మీకం జననం!
తపస్సు పూర్తి, ప్రాప్తి ,
వాల్మీకి కొత్త జీవితం!
ఓ రోజు క్రౌంచ పక్షి జంట,
సుందర దర్శనం!
ఒకటి బోయ చేత మరణం,
రెండవది మౌనరోదనం!
తక్షణం, వాల్మీకి నోట,
"మా నిషాద", శ్లోక ఉచ్చారణం!
బ్రహ్మ ఆశీర్వచనం,
ఇక, ఆదికావ్య శ్రీకారం!
కరకు మనిషి ,
మహర్షిగా పరివర్తనం!
మానవజాతికి వాల్మీకి,
జీవితమే దృష్టాంతం!
రాముడు నవమే, పుట్టించిన,
వాల్మీకి, పౌర్ణమి పుణ్యం!
వ్యక్తిత్వ వికాస ఆది ,
శ్రీరామాయణ మహాకావ్యం!
_________

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి