కోపమొకింత లేదు: - కె ఎస్ అనంతాచార్య కరీంనగర్ -9441195765
 

ముక్కు మీద కోపం ముఖానికి అందం... పాట విన్నప్పుడు గమ్మత్తుగా అనిపించింది. రాజుల కాలంలో అలక గృహాలు ఉన్నాయని చదివినప్పుడు ఆశ్చర్యం వేసింది. సినిమాలో హీరో హీరోయిన్ల మధ్య చిరు కోపం అలకలు కోపతాపాలు చూసినప్పుడు సరదా వేసింది. అయితే మనసు కిటికీ తెరిచి చూస్తే కోపం ఎలా ఉంటుంది? బాహ్య అంతర్గత లక్షణాలు లక్ష్య లక్షణ సమన్వయాలు ఏంటి? 
కోపం ఎప్పుడు నన్ను, నేను అని ego నుండి ప్రారంభమవుతుంది. అంటే ఇగో నుండి కోపం దీని నుండి ఇరిటేషన్ కలుగుతాయి. కోపం అనేది మన మందరం అనుభవించే ఒకానొక భావోద్వేగం. ఇది మానవ సహజం అన్ని భావోద్వేగాల లాగా కోపం నిరాశ చికాకును కలిగిస్తుంది. మనం ఒక లక్ష్యాన్ని సాధించకుండా అడ్డుపడినప్పుడు మరియు/ లేదా మన పట్ల అన్యాయంగా ప్రవర్తించినప్పుడు తల ఎత్తే సార్వత్రిక భావ ఉద్వేగాలలో కోపం ఒకటి. కోపం నేరుగా రాదని నెరవేరని కోరికల (కామం) నుంచే కోపం పడుతుందని ఉపనిషత్తుల సారాంశమైన భగవద్గీత తెలుపుతుంది. 
కోపం ( క్రోధ) అనేది మనిషి వివేకాన్ని ఆధ్యాత్మిక ఎదుగుదలను నాశనం చేసే  ఒక మానసిక శక్తుల సమాహారం (ఉపనిషత్తుల ప్రకారం) 
మనిషిని బంధించే ఆరు అంతర్గత శత్రువుల్లో కోపం(కామ, క్రోధ, లోభ, మోహ,మద, మాత్సర్యాలు) ఒకటిగా తెలిపాయి.(వేదాలు ఉపనిషత్తులు).
మనోవిజ్ఞాన శాస్త్రం ప్రకారం ఒక natural emotion. మన హక్కు, మన విలువ, మన అవసరం దెబ్బతిన్నప్పుడు  మెదడులోని Amygdala (భావోద్వేగ కేంద్రం) ఇచ్చే అలారం ఇది. కోపమనేది నా దారి నుండి నువ్వు తప్పుకో అంటుంది. మనలోని కోరికలు లేదా లక్ష్యాలు నెరవేరకుండా అడ్డుపడిన ఫ్రస్టేషన్ వలన కలిగే ఒకానొక దూకుడు స్వభావం. ఆధునిక సైకాలజీ పితామహుడు  సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రకారం.... కోపం ఒక మానసిక భావన(emotion ) శరీరంలో జరిగే మార్పు  (biological response) మరియు ప్రవర్తన ( behaviour) ఈ మూడింటి కలయిక అంటారు. 
కోపానికి కారణాలేంటి?
ఈవేళ చిన్న చిన్న కారణాలు కోపానికి దారితీస్తున్నాయి. 
టీవీ రిమోట్ ఇయ్యనందుకు,
సెల్ వాడనీయకపోవడం వలన. స్వేచ్ఛగా తిరువనీయకపోవడం, తల్లిదండ్రులు/ గురువులు మందలించడం వల్ల, 
డ్రగ్స్ ,ఆల్కహాల్ లాంటి మత్తు పదార్థాలకు అలవాటు పడినప్పుడు, 
ఆస్తులు, అంతస్తులు మధ్య తేడాలు పోలికల వలన, సోషల్ మీడియా, ఒత్తిడి హార్మోన్ల అసమతుల్యత, ఆరోగ్య సమస్యలు, డిప్రెషన్ యాంగ్జైటీ, బై పోలార్ డిసార్డర్స్, విద్యార్థులకు అసైన్మెంట్స్,  ఉద్యోగస్తులకు పని ఒత్తిడి, భార్యాభర్తల మధ్య అవగాహన లోపాలు, అదుపుతప్పిన కోరికలు, స్వీయ నియంత్రణ తగ్గడం. స్థూలంగా చూస్తే ఇవన్నీ మానసిక మరియు భావోద్వేగా అంశాలు, శారీరిక జీవ సంబంధిత అంశాలు, అంతర్లీన మానసిక రుగ్మతలు, భాష లేదా సామాజిక కారణాల కిందకి వస్తాయి.
Iceberg model ప్రకారం కోపం అనేది మంచుకొండపై భాగం. దాని కింద భయం బాధ అవమానం అలసట ఆకలి ఉంటాయి. 
90 second rule (neuro scientist jill Bolt Taylor )
కోపం వచ్చినప్పుడు శరీరంలో 90 సెకండ్ల వరకు మాత్రమే ఉంటుంది. మన ఆలోచనలు కోపాన్ని పెంచుతున్నాయి అంటారు. 
కోపంలోని రకాలు
కోపం మూడు రకాలుగా కనిపి స్తుంది. 
1.Passive anger 
పైకి నవ్వుతూ లోపల కుళ్ళిపోవడం. దీర్ఘకాలికంగా బీపీ షుగర్ డిప్రెషన్ కి ఇది దారితీస్తుంది. 
2.Aggresive anger 
అరవడం, కొట్టడం వస్తువులను పగలగొట్టడం సంబంధాలను తెంపివేయడం ఇందులో కనపడుతుంది.
3.Assertive anger
ఇది ఆరోగ్యకరమైనది. నాకు ఇది నచ్చలేదు, నాకు ఇది కావాలి అని స్పష్టంగా ప్రశాంతంగా చెప్పడమే. కోపం లేకపోతే యుద్ధాన్ని గెలవలేదు ధర్మాన్ని కాపాడలేవు అంటుంది (ఋగ్వేదం.. మన్యు సూక్తం).
కోపాన్ని వ్యాధిగా చూసింది అధర్వవేదం. 
కోపం వచ్చినప్పుడు శరీరంలో కలిగే మార్పులు
కోపం కలిగినప్పుడు శరీరం బిగుసుకు పోతుంది. గుండె వేగంగా కొట్టుకుంటుంది. 
అడ్రినలిన్ పొంగినట్లు కూడా అనుభూతి పొందవచ్చు. బీపీ పెరుగుతుంది. శరీరం ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్ లోకి వెళ్లి పోతుంది.
దీని వలన ఆర్డినలిన్ కార్టిసోల్ వంటి హార్మోన్ల పై ఒత్తిడి జరుగుతుంది, ఇవి భారీగా విడుదలవుతాయి. శ్వాసలో మార్పు కలుగుతుంది. శరీర ఉష్ణోగ్రత కూడా పెరుగుతుంది. 
మాటలు తడబడతాయి. గొంతు ఆరిపోతుంది. మానసికంగా ఆలోచన శక్తి తగ్గిపోతుంది. ఏకాగ్రతలోపిస్తుంది. చికాకు అసహనం, పగ, ప్రతీకార భావన ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది 
 
 *కోపాన్ని ఏం చేయాలి?
పెద్దవాళ్లు మనం కోపానికి వచ్చినప్పుడు గుర్రాన్ని కట్టేవోయి అనడం.... కోపాన్ని మూటకట్టి పెట్టు అని అనడం విన్నాం. 
మనోవిజ్ఞాన శాస్త్రం కోపాన్ని అణచవద్దు... నిర్వహించు అంటుంది.
కోపాన్ని అదుపులో ఉంచుకోవడం కోసం ....
stop technique పాటిద్దాం 
S...stop..ఆగు
T... Take a breath (ఊపిరి తీసుకో) 
O... Observe (నీ భావాన్ని గమనించు) 
P... Proceed mindfully 
(ఆలోచించి ముందుకు సాగు) 
Time technique లో పది నిమిషాలు టైం ఇచ్చి తర్వాత మాట్లాడాలి.
భగవద్గీత... క్రోదాద్భవతి సమ్మోహ: అంటుంది అంటే కోపం తెలివిని కప్పే స్తుంది కోపానికి రావడం తప్పు కాదు కానీ కోపంలో ఉండి నిర్ణయం తీసుకోవడం తప్పు అని తెలుపుతుంది.
ఆప: శాంతి: జలములు శాంతించుగాక (అధర్వణ వేదం (19.9.14) ప్రకారం కోపం వచ్చినప్పుడు మంచినీళ్లు తాగడం వలన మనసుకు శాంతి ప్రశాంతతా కలిగి కోపం చల్లారుతుంది. 
కోపాన్ని యజ్ఞంలో ఆహుతి చేయు అంటుంది యజుర్వేదం. 
కోపాన్ని లోపల దాచుకోక, జ్ఞానం అనే అగ్నిలో కాల్చివేసేయ్. 
Anger management
ప్రకారం నీళ్లు తాగు, మౌనంగా ఉండు, స్థలం మార్చు అంటుంది.
 కోపముకింత లేదు బుధ కోటికి..... అన్నట్లు జ్ఞానులైన వారి కోపం, పాలపొంగు లాగా ఒక క్షణం వచ్చి వెళుతుంది. 
అలాంటి మంచి అలవాటును మనమూ రూపొందించుకుందాం. 
కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
Nicely explained
అజ్ఞాత చెప్పారు…
Wow sir
అజ్ఞాత చెప్పారు…
Your analysis is scientific, informative and applicable to control the emotions. Super baava gaaru👏👏👏🙏🙏🙏
అజ్ఞాత చెప్పారు…
Analysis very nice sir 🙏🙏