ఎన్నికలు; - ఋష్యశృంగు ఢిల్లేశ్వరరావు (ఋష్యశ్రీ)- సారవకోట -చరవాణి: 9490904976


ఎన్నికలు
ఎన్ని కలలు 
ఎన్నికలలో చూపిస్తారు ఎన్ని కళలో..

జరిగేనా జనుల కన్న కలలు.
జగతిని మార్చేవి, 
జీవన గతిని మెరుగుపరిచే కలలు..

పదవి ఐదేళ్లే.
పదవి పైసలు, పవర్ కోసం కాకుండా 
పనికొచ్చే, ప్రయోజనమున్న పనులు చేస్తే, చేయిస్తే,
పల్లె, పురం, పట్నం ప్రగతి, పురోగతి..

పలుకుబడి, పైకం ఉందని, పెత్తనం చూపించకు బాస్..
మంచి పనులు చేస్తే భేష్..
ప్రజలకు అన్ని విధాలుగా సహాయపడితే శభాష్..

పరిపాలనలో
ప్రజలు నిన్ను ప్రశంసించేలా
ప్రజల మదిలో నీవు స్థానం పొందేలా
పదికాలాలు గుర్తుపెట్టుకొనేలా నిలువు
ప్రజల మనసు గెలువు..

✍️
కామెంట్‌లు