అంతులేని కథలు(కన్నీటి జీవనయానం): - అంకాల సోమయ్య -దేవరుప్పుల-జనగామ -9640748497


విప్పార్చిన ముఖాల్లో 
విషాధగాథలెన్నో
కంటి అంచున 
దాగిన చెదిరిన 
కలలెన్నో

గలగలపలికే
ఆ పెదాలమాటున 
ఏకాంతంలోఉబికే దుఃఖం ఎంతో...

అలుపేలేని జీవనయానంలో 
ఎత్తుపల్లాలెన్నో...

పొట్టకూటికై
నిత్యయాతన
వలస జీవనమే జీవనాధారమై
బ్రతుకు బండిలాగే
పేదల కన్నీటి కథలెన్నో...

జీవన చరమాంకంలో 
కన్నబిడ్డలే కసాయిలైతే
ఏకాకులైన
వృద్ధులెందరో...

మెట్టినింట తానోయంత్రమై
ఇంటిల్లిపాదీకి చాకిరీతో 
కాసింత విరామమేలేని
వనితల ఆంతరంగపు ఆవేదనెంతో....

చదివిన చదువుకు ఉద్యోగం దొరకక
తల్లిదండ్రుల ముందు ముఖంచెల్లక 
నిరాశ నిస్పృహల మధ్య నలిగిపోయే యువత మనోవేదనెంతో...

వ్యవసాయమో జూదంగా మార్చిన
కార్పోరేట్ సంస్థల  నిలువుదోపిడీతో
అర్థాంతరంగా తనువు చాలిస్తున్న కృషీవలులెందరో...

బ్రతుకు పోరులో 
ఓటమితప్పా గెలుపే ఎరుగని 
కష్టజీవుల జీవనగాథలెన్నో...

కాలపర్యంతం సాగే
ఈ జీవన్మరణ పోరాటంలో
ప్రతీ గాయమో గేయమై 
అంతేలేని చరితకు అంకురార్పణైన కథలెన్నో 

కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
Nice sir 👌👌