విరిగిన మనసులువారి హృదయాంతరాల్లోబాల్యంలో ఒకరిపై ఒకరు చూపిన ప్రేమాభిమానాలు స్ఫురణకు తెచ్చుకోవాలి.కష్టకాలంలో ఒకరికొకరు తోడవసరంవార్థక్యం ఆవహించకమునుపేమనం మరింత దగ్గరవ్వాలిఇక్కడ మధ్యవర్తి ప్రమేయం లేకుండా చూసుకోవాలి.మునుపు అతగాడు అన్నమాటలు మరెప్పుడు నేను అనడం జరగదనిపైపై మాటలు కాదు మాట్లాడాల్సింది.మనసులో ఎటువంటి కల్మషం లేకుండా మాట్లాడుకోవాలి.కాళ్ళు రెక్కలు పని చేసినంత కాలంచేతినిండా పనిపాటలున్నంతకాలంమన మాటకు, చేతకు విలువ ఉంటుండేది.అప్పుడు మనమిచ్చేడబ్బుకు ఆశపడిమన ప్రసన్నత కోసం క్యూ కట్టేవారుఇప్పుడేరి? ఎక్కడ?ఎవరూ కారురక్తసంబంధీకులేఆత్మీయులౌతారు.ఇదివరకు అన్న సూటిపోటి మాటలు ఇప్పుటికి నాచెవుల్లో మార్మోగుతున్నాయిఅయినానా తాలుకా వాన్ని నేను ఇప్పుడు నమ్మి తీరాలి.కళ్ళలో ఉబికివస్తున్న దుఃఖాన్ని అదిమిపట్టైనతెచ్చి పెట్టుకున్నప్రేమాతిశయంతో పలకరింపులు మొదలు పెట్టాలి.ఇప్పటికిప్పుడునేను మునుపటి దొంగ, స్వార్థపూరిత వ్యక్తైనవీడితోనే సహవాసం చేయడమంటేగుంటనక్కతో మిత్రత్వంపులితో కలిసి తిరగడంఊహించుకుంటేనే కదా!?రక్తం మరిగిపోతుందిఆవేశం కట్టలు తెంచుకొనివస్తుంది.మున్ముందు ఈ దోపిడీకోరులీలలు ఎన్నిచూడాలో! ఏమో!దొంగనునయవంచకుడనుఇప్పటికిప్పుడు సజ్జనుడనుకొని నెత్తికెత్తుకోవాలి.కలికాలమహిమ కాలసర్పంతోసహవాసమిదిజాగురూకతేశ్రీరామరక్ష

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి