మనసు : - అచ్యుతునిరాజ్యశ్రీ


 కంటికి కన్పడని మనసు చేసే చిత్ర విచిత్రాలు అపూర్వం,అద్భుతం!మన ఆలోచనలు చేతలకు బాటలు! మన అదృష్ట దురదృష్టాలకు  మూలం మనసు!our life is what our thoughts make it మన ఆలోచనలే మన జీవితం అన్నాడు ఓవేదాంతి.ఓటమి పరీక్షల భయంతో పిల్లలు కుంగిపోతున్నారు.సమస్యాపరిష్కారంకై ఆలోచన చేయాలి.మొదటి ప్రపంచ యుద్ధపు రోజుల్లో కొంతమంది  యుద్ధప్రాంతదృశ్యాలు ఫోటోలు తీశారు.లారెన్స్ ఇన్ అరేబియా అనే సినిమాగా రిలీజ్ చేస్తే,నాటకశాలలన్నీ మూతబడి,అందరుజనాలు ఆసిన్మాతో వెర్రెక్కి పోయారు.థామస్ అనే వ్యక్తి అప్పులు కుప్పల ఊబిలో ఉక్కిరిబిక్కిరైనాడు.  కానీ పైకి గంభీరంగా తిరిగేవాడు.అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆలోచనలు తప్పుడు ఆలోచనలు వస్తాయి.కొంతమంది మన ఉన్నతిని చూడలేక  కుళ్లుబుద్ధితో  నెగిటివ్ గా,నకారాత్మకంగా మాట్లాడి మనసుని కుళ్లబొడుస్తారు.అలాంటివారికి మనోధైర్యం కల్గించాలి. ఓసినిమాపాట ఇదే చెప్పింది"నిన్ను నిన్నుగా ప్రేమించుటకై నీకోసమే కన్నీరు నింపుటకై నేనున్నానని నిండుగ పలికే తోడొకరుండిన అదే భాగ్యము" అలా సకారాత్మక భావాలతో ఉండేవారితో ఉత్సాహం కలుగుతుంది.అందుకే మనకు "దైవస్మరణ తో మనసుప్రశాంతంగా ఉంటుంది,ధ్యానం యోగ చేయమని చెప్తారు.దైవం ఉన్నాడనే భరోసాతో మొక్కు కుంటాం. మనసులో మంచిభావాలు కల్గి ఆపదలనుంచి బైట పడతాం. అందుకే పాజిటివ్ గా మాట్లాడేవారితో స్నేహం చేయాలి.వారి సలహాలతో జీవితాన్ని కొనసాగించాలి🌹
కామెంట్‌లు