ఎందుకు నాపై ఇంత ద్వేషం పెంచుకుంటున్నారు? అని ఎవరైనా అడిగితే నేనేం చెప్పాలి?
ఎప్పుడో ఏదో ఒక సంఘటన జరిగి, నేను మర్చిపోయిన క్షణాలను నాకు మళ్లీ గుర్తుచేసి వెళ్లమని చెబుతాను.
ఇప్పటికీ వాస్తవాలనే మోస్తూ తిరుగుతున్నాను. బహుశా అదే అన్నింటికంటే పెద్ద కారణం కావచ్చు.
మంచివాడిగా మారేందుకు ప్రయత్నించకపోవడం కావచ్చు
చెడును వదులుకోకుండా
మోస్తూ ఉండటం కావచ్చు
మౌనంగా ఉండటమే ఇష్టపడటం కావచ్చు...
బహుశా అదే ద్వేషాన్ని మరింత పెంచి ఉండవచ్చు.
నేను మారలేదు...
కానీ
ఎవరి దృష్టిలో వారికి
నాకు ఉన్న అర్థం మాత్రం మారిపోతూనే ఉంది!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి