" నేల తల్లి ఆవేదన ": - కోరాడ నరసింహా రావు


నీటి నుండి పుట్టిన నేను  
 నా తల్లి ప్రేమను పొంద లేకున్నాను...! 
 
సకల ప్రాణి కోటికీ తల్లి నైన నేను ... 
 తల్లడిల్లిపో తున్నాను !!

నన్ను పులకింప జేసే నా తల్లి ప్రేమామృత ధారల లో పరవశమును పొంద లేకున్నాను...! 

ప్లాస్టిక్ వ్యర్ధముల కాలు  ష్య కోరలలో చిక్కి 
  ఊ పి రాడక ఉక్కిరి బిక్కి రైపోతున్నాను...!! 

సిమెంట్, తారు, కా0క్రీట్ల అడ్డ గోడలు... 
  ఇంధన వాహనాలు, A C లు... ఫ్రిజ్ లు 
  నా తల్లి ప్రేమనుండి నన్ను దూరం చేసేసాయి  ! 
 
నా గొంతే ఎండిపో తుం టే... 
  మీ గొంతులు నేనెలా తడప గలను...!! 

నా తల్లి నాపై కురిపించే జీవ జలం... 
 ఒక చుక్కైనా నన్ను తా కటం లేదు! 
  ఇంక నే నెలా పులకించ గలను...!? 
 మిమ్మెలా పులకింప జేయ గలను...?! 

కలుషితాలు... వైరస్లు 
 ఎల్నినోతో అనావృష్టి , అతి వృష్టి...! 

వింత వింత రోగాలు, విపరీత మరణాలు...! 
అయ్యయో...! 
  నా బరు వెక్కిన గుండెతో... 
 మీకు జన్మ నిచ్చిన నా కడుపు లోనే తిరిగి మిమ్ము
 దాచు కోవటం తప్ప... నే నేమి చేయ గలను!?! 

ఇక నైనా మేల్కొండి బిడ్డలారా...! 
 రోగ గ్రస్త మైన నన్ను బాగు చేసుకునే బాధ్య త మీదే... 
 నన్ను ఆరోగ్యంగా ఉంచండి... 
 మీరు సుఖ శా0తులతో 
 కల కాలం వర్ధిల్లండి... 
 
ఈ నేల తల్లితో... 
  సకల ప్రాణి కోటి ఆరోగ్యానందాలను పొందుదురు గాక... 
 ఓం శా0తి ! 
   ******
         
కామెంట్‌లు