వైకుంఠము దివ్యధామము. అక్కడ దుఃఖము, భయము, క్రోధము, మృత్యువు ఉండవు. లక్ష్మీదేవితో కూడి శ్రీహరి శేషతల్పముపై ఉంటాడు. అటువంటి దివ్య ధామమునకు జయ విజయలు ద్వారపాలకులు. భగవంతుని ప్రియ సేవకులు.
ఒకనాడు బ్రహ్మ మానస పుత్రులు సనక, సనందన, సనాతన, సనత్కుమారులు వైకుంఠము చేరారు. వారు ఐదేండ్ల బాలకుల రూపం ధరించారు. దివ్య తేజస్సు కలిగి ఎవరి అడ్డంకులూ లేకుండా లోపలకు ప్రవేశిస్తున్న తరుణంలో జయ విజయలు వారిని నిరోధించారు. "బాలల్లారా! భగవానుడు విశ్రమించుచున్నాడు. అనుమతి లేక లోపలికి వెళ్లరాదు" అని చెప్పారు.
చిన్నారుల రూపంలో ఉన్న ఋషులకు కోపం వచ్చింది. ఆగ్రహించిరి. "అహంకారం గల సేవకులు వైకుంఠానికి అనర్హులు. మీరు భూమిపైకి పోయి అసురులు కాగలరు" అని శపించారు.
జయ విజయలు భయపడి క్షమాపణ కోరారు. శ్రీహరి ప్రత్యక్షమయ్యాడు. భగవానుడు వారితో "మీరు ఏడు జన్మల భక్తులుగా లేదా మూడు జన్మల శత్రువులు కావాల్సిందే" అన్నాడు. భగవానుని వీడి ఉండలేక వారు మూడు జన్మల శత్రుత్వము కోరారు.
సత్యయుగమున హిరణ్యాక్ష, హిరణ్యకశిపులుగా జన్మించారు. శ్రీహరి వరాహ, నరసింహ అవతారములతో వారిని సంహరించాడు.
త్రేతాయుగమున రావణ కుంభకర్ణులుగా పుట్టారు. శ్రీరాముడు వారిని వధించాడు.
ద్వాపరయుగమున శిశుపాల దంతవక్రులుగా జన్మించిరి. శ్రీకృష్ణుడు వారికి ముక్తి ప్రసాదించాడు.
మూడు జన్మలు ముగిసిన పిమ్మట జయ విజయలు వైకుంఠము చేరారు. ఇది శాపం కాదు; భగవానుని దివ్య లీల. ఈ లీల ద్వారానే లోకానికి ధర్మ రక్షణ లభించింది. భగవంతుని యోజన ఎల్లప్పుడూ లోకకల్యాణము కోసమే తప్ప మరొకటి కాదు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి