కొంతమందికి తమ జీవితం గురించి ఆలోచించడానికి టైమ్ ఉండదు,కానీ పక్కవాడి జీవితం గురించి మాట్లాడటానికి రోజులో గంటలూ సరిపోవు!
ఎవరో ఎదిగితే పొరపాటున కూడా అభినందించరు “ఏదో అదృష్టం కలిసొచ్చింది” అంటారు!
ఎవరో సంతోషంగా ఉంటే చూసి సంతోషించరు, “ఎంతకాలం ఉంటుందో చూద్దాంలే” అంటారు!
ఎవరో కొత్తగా ఏదైనా కొంటే, వాళ్లకు అవసరమా అని ముందుగా వీళ్లే నిర్ణయిస్తారు!ఎవరో తప్పు చేస్తే చాలు… దాన్ని పది మందికి చెప్పడం వీళ్ల "సామాజిక బాధ్యత"!
తమ ఇంట్లో సమస్యలు ఎన్ని ఉన్నా, పక్కింటి సమస్యలపై మాత్రం పూర్తిగా మాట్లాడుకునే హక్కు వీరిదే!
పని లేకపోతే పుకారు…
పని ఉంటే కామెంట్…
ఇదే రోజువారీ షెడ్యూల్!
తమ జీవితంలో మార్పు రావాలని కోరుకుంటారు,
కానీ పక్కవాడి మార్పు మాత్రం అస్సలు సహించరు,చచ్చినా ఒప్పుకోరు.
నిజానికి వీళ్లకు శత్రువులు అవసరం లేదు… పక్కవాళ్ల విజయాలే చాలు!
ఇతరుల జీవితాలను గమనిస్తూ గమనిస్తూ… తమ జీవితం ఏం అయిపోయినా పర్వాలేదు!
పక్కవాడిమీద కామెంట్ చేయకపోతే వీరికి
రోజు నడవదు…
పూట గడవదు…

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి