కాంతి దాతవై....
ఆరోగ్యానికి
అసమాన అభయమై...
చీకటిని తొలగించే
వెలుగుల వలయమై..
జగమంతటిని
కాంతిమయం చేస్తూ.....
ప్రతి ఉదయం నియమంగా
నీ అద్భుత ఆగమనంతో...
మేదినిని మంగళ మయంగా
మలచి చైతన్య పరుస్తూ....
కాంచన మయమైన
కిరణాలు ప్రసరింపచేసి
పులకరించే పృథ్విని
కనకమయం చేస్తూ....
వేకువలో గువ్వల
కువకువలు నాదమయంగా..
కదిలే నదుల గలగలలతో
జగమే వేదమయం కాగా...
అన్వయించలేని
అందాలతో ప్రకృతి కాంత
కమనీయమైన సొగసుతో
రమణీయంగా ప్రకాశించగా...
సూర్యోదయాన్ని తిలకించే నయనద్వయాలకు
సుందర సురుచిర భావాలతో
రాగమయమైన హాయినిచ్చే...
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి