కొత్త ఆలోచన: - యామిజాల జగదీశ్


 అమెరికాలో Pizza Hut సంస్థ చేపట్టిన ఓ కొత్త ప్రయత్నం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది!
పుస్తకాలు చదివే అలవాటును ప్రోత్సహించేందుకు “Little Hut Libraries” పేరుతో చిన్న చిన్న పుస్తకాల మార్పిడి కేంద్రాలను ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని ఆ సంస్థ ప్రారంభించింది.
ఓ చిన్న చెక్క పెట్టెలో పుస్తకాలు ఉంచుతారు.
మీ దగ్గరున్న పుస్తకాన్ని అక్కడ పెట్టి వెళ్లొచ్చు.
అక్కడున్న పుస్తకాన్ని తీసుకెళ్లి చదవొచ్చు.
చదివిన పుస్తకాన్ని తిరిగి ఇతరులతో పంచుకోవచ్చు.
ఇలా ఒకరి పుస్తకం మరొకరి పఠన ప్రయాణానికి ఆరంభం అవుతుంది!
ఈ కార్యక్రమంలో భాగంగా అమెరికా అంతటా ఎంపిక చేసిన 24 ప్రాంతాల్లో చిన్న పుస్తకాల గ్రంథాలయాలను ఏర్పాటు చేయనున్నారు. ప్రతి గ్రంథాలయంలో తొలుత 25 పుస్తకాలను అందుబాటులో ఉంచనున్నారు.
పుస్తకాలు కొని చదవడం మాత్రమే కాదు... చదివిన పుస్తకాలను ఇతరులతో పంచుకోవడం కూడా ఓ మంచి సంస్కృతే! 
కామెంట్‌లు