నానీలు.: - పాలగుమ్మి జ్యోతి.


ముడుచుకుంది
గొడుగు వదనం!
విప్పారింది 
చిరుజల్లులకు!! 

నాటిన విత్తు
భూమికి ఇచ్చింది!
మొక్కగా మొలుస్తానన్న 
వాగ్దానం!! 

తొంగి చూస్తున్నాడు  
చిలిపిగా చంద్రుడు!
మేఘం 
కిటికీలోంచి!!

వాన రాకతో
గిరులు సింగారించాయి!
జలపాతాల 
జడలు!!
కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
Superb 👏👏👏