సుప్రభాత కవిత : -బృంద


మౌనంగా తెరచుకున్న 
దారి వెంట పయనించి 
దూరంగా వెలుగు రేఖను 
చేరుకొమ్మని పిలుపు!

కాలి కింది రాళ్లన్ని 
కష్టాన్ని గుర్తు చేస్తే..
వాలిన కొమ్మలు 
సేద తీర్చు వీవనలే!

గమ్యం కోసం అడుగులేసే 
మర్మమేమి తెలియని 
మనసుకు... నమ్మకమే 
తోడు వచ్చు నీడ!
 
చిదిమిన చింతలకు 
వడలిన నిర్ణయాలకు 
చిందిన కన్నీరే చేవగా 
చిగురించిన ఆశలు!

అలవని అడుగులకు 
ఆగని ఆలోచనలకు 
ఆసరాగా వున్నది 
అలజడి లేని మది ఒకటే!

వెలిగే తూరుపు దీపం 
పంచే వెలుతురు దీవెన 
అండగా ఉన్నంతవరకూ 
పండగేగా వేకువంటే!

🌸🌸సుప్రభాతం 🌸🌸

కామెంట్‌లు