ఎక్కడికైనా
ఎగిరిపోగలిగి ఉండి
భూమిపై
ఎక్కడైనా
ఉండగలిగి ఉండి
భూమిపై
ఎక్కడైనా గూడు
కట్టుకో గలిగి ఉండి.
ఒకే చోటికి
తిరిగి వస్తుంది- పక్షి..
ఎందుకు..?
రెక్కలు తొడిగిన
మనిషి కూడా అంతే.!!
వీళ్లకు
రెక్కలతో పనిలేదు
గూడుతో పనిలేదు
గుప్పెడు గుండెతో పని.!?
===========================================
సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని యుపిఎస్ ఖానాపూర్ నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి