ఫైన్ కట్టి వెళ్ళు!
ట్రైన్ టికెట్ లేకుండా ప్రయాణించావా?
ఫైన్ కట్టి కూర్చో!
తాగేసి బండి నడుపుతున్నావా?
ఫైన్ కట్టి బండి తీసుకెళ్ళు!
కాలేజీలో సరిపడా హాజరు లేదా?
ఫైన్ కట్టి హాల్‌టికెట్ తీసుకో!
ఎక్కడ చూసినా ఒకటే సూత్రం, నిబంధన పాటించకపోతే ఫైన్ కట్టేయి!దాంతో తప్పు తప్పు కాకుండా పోతుందా ఏంటి?
ఫైన్ అనేది తప్పు చేయడానికి ఇచ్చిన టికెట్ కాదు కదా!కానీ మన తీరు చూస్తుంటే,రూల్స్ అంటే పాటించాల్సినవి కాదు,
అవసరమైతే డబ్బులు చెల్లించి దాటేయాల్సిన అడ్డంకిలా మారిపోయింది!
“ఫైన్ కట్టేశాను కదా!” అని చెప్పేసి తప్పును కూడా చట్టబద్ధం చేసుకున్నట్టు ఫీల్ అవుతున్నాం!
మనం అడగాల్సింది
“ఎంత ఫైన్?” కాదు.
ఫైన్ కట్టడం వల్ల తప్పు ఖరీదు మాత్రమే తెలుస్తుంది…తప్పు సరైనదైపోదు కదా!అసలు ఫైన్ కట్టాల్సింది జేబుతోనా?మన మనస్తత్వంతోనా? ఏమో మరి?
అదే అసలు “ఫైన్ వర్సెస్ ఫైన్!”

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి