మౌసలపర్వము! : - అచ్యుతునిరాజ్యశ్రీ
 

మహా భారత యుద్ధం ముగిసి 35ఏళ్లు నిండాయి.తుఫాన్,ఈదురుగాలులు,ఇసుకలో ఇంకిన నదులతో ప్రకృతిభీభత్సంతో పాటు వృష్ణివంశీయులంతా చనిపోయారు.కేవలం బలరామ కృష్ణులు మాత్రమే మిగిలారు. 
వృష్ణి  అంథక భోజవంశాలవారు శాపానికి గురై చనిపోయారు.దీనికో కారణం ఉంది.ఒకసారి విశ్వామిత్రుడు, కణ్వుడు, నారదుడు ద్వారకకు వెళ్లారు.సారణుడు మొదలైన వారు సాంబునికి ఆడవేషం వేసి"మహర్షులారా! ఈమె బభ్రునిభార్య. ఈమెగర్భవతి.పుట్టే శిశువు ఎవరు?" అని అడిగారు.విషయం గ్రహించిన ఆఋషులు ఆగ్రహంతో" మాతో పరిహాసాలా? కృష్ణుని కొడుకైన సాంబుడు  ఒక ఇనుపముసలాన్ని ప్రసవిస్తాడు. మీరంతా నాశనమవుతారు. బలరామ కృష్ణులు మాత్రమే మిగులుతారు. బలరాముడు తన శరీరాన్ని విడిచి సముద్రంలో ప్రవేశిస్తాడు. జరుడు అనే వేటగాడి బాణంతో కృష్ణుని నిర్యాణం తప్పదు." ఇదంతా మునులు కృష్ణుడికి చెప్తే,ఆయన కానున్నది కాకమానదు అని విని ఊరుకున్నాడు.సాంబుని కడుపున ముసలం పుట్టింది.ఉగ్రసేనరాజుకి తెల్సి దాన్ని పొడిచేయించి సముద్రంలో పారేయిస్తాడు. ఎవరూ మద్యం తయారుచేయరాదని చాటింపు వేయిస్తాడు. ఉత్పాతాలు, బాటలపై ఎలుకలు సంచరిస్తూ ,మనుషుల జుట్టు గోళ్లను కొరికి తినసాగాయి. యదువంశీయులు పాపపుపనుల్లోమునిగితేలుతున్నారు. గాంధారిశాపం గుర్తుకువచ్చిన కృష్ణుడు , ప్రజలందరినీ ప్రభాసతీర్థంలోని సముద్ర తీరానికెళ్లమని ఆదేశించాడు. ఉద్థవుడు కృష్ణునివద్ద సెలవుతీసుకుని వెళ్లిపోయాడు.సాత్యకి కృతవర్మ ను అనవసరంగా దూషించి చంపేశాడు. ఆపై చచ్చాడు. యదువంశీయులు తమలో తామే పోట్లాడుకుని చచ్చారు. కృష్ణుడు చూస్తుండగానే సాంబుడు,ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు చనిపోయారు.🌹
కామెంట్‌లు