బ్రహ్మ దేవుని ఆజ్ఞనుసారము దేవేంద్రుడు లంకకు వెళ్లి
సీతా దేవికి దివ్యమైన పాయసమును అర్పించుట
ఓ దేవరాజా! దుర్మార్గుడైన రావణుడు
సీతనపహరించి లంకలో ఉంచెను దీనివలన
రాక్షసుల వినాశనము ముల్లోకాలకు విజయము.
ఓ దేవేంద్రా! నీవు వెంటనే లంకకు చేరుము
మొదట సీతాదేవిని దర్శింపుము
దివ్యమైన పాయసము ఆమెకు ఇవ్వుము
బ్రహ్మమాటలిని దేవేంద్రుడు వెడెలెను
ఇంద్రుడు నిద్రాదేవితో గూడి లంకకు చేరెను
నిద్రాదేవీ! నీవు ఆ రాక్షసుల వద్దకు వెళ్లి
వారందరిని నిద్రలో ముంచివేయుము
ఆమె రాక్షసులను నిద్రావశులను గావించెను.
దేవేంద్రుడు సీతాదేవిని సమీపించెను
ఓ జానకి దేవీ! నీకు మేలు కలుగుగాక
నేను సురరాజును మహాత్ముడైన
శ్రీరాముని కార్యసిద్ధికి తోడ్పడగలను.
ఓ శుభాంగీ! నా మాయ ప్రభావము వలన
రాక్షసులెల్లరును నిద్ర మత్తులో ఉన్నారు
ఓ రాజకుమారీ నేను నిద్ర దేవితో వచ్చాను
నీకై దివ్య పాయసము తీసుకొనివచ్చితిని.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి