ప్రక్రియ: రుబాయిలు(తిశ్రగతి)
పూజలందు గణపతిగా కొలువునట్టి పసుపునేను!
సుమంగళికి సౌభాగ్యము నొసగునట్టి పసుపు నేను!
పసిడి వన్నె కాంతులీను మంగళకర హరిద్రమును!
అంగనలకు సౌందర్యము ఇచ్చునట్టి పసుపు నేను!!
వంటలలో మిశ్రమమై వన్నెతెచ్చు పసుపు నేను!
దివ్యమైన ఔషధముగ పనికివచ్చు పసుపు నేను!
జలములోన కలిపినచో గృహదోషము నివారింతు!
అక్షింతల తయారీకి కలసివచ్చు పసుపు నేను!!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి