పరమాత్ముని ఆదేశంతోపుడమిపై పుట్టినప్రతిమనిషి జీవితం ఒక పుస్తకమేబాల్యంలో అనురాగ ఆప్యాయతలు కొందరివైతేనిత్యం చీదరింపు, ఛీత్కారాలతో పెరిగిన వారు ఇంకొందరుయవ్వనంలో హాయిని గొల్పే అనుభూతి కొందరివయితేరేపు ఎలా అని జీవించే కష్టాలు కడగండ్లు కొందరివి.శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పినట్లుఎన్ని ఆటంకాలు ఎదురైనస్థితప్రజ్ఞతకు దర్పణంలా నిలిచిన జాతిపిత మహాత్మాగాంధీజై జవాన్, జై కిసాన్ అనికర్షకులు, రక్షకులు దేశానికి వెన్నెముకలని చెప్పినఆదర్శప్రధాని శాస్త్రీజీవర్ణ వివక్షత పారద్రోలిదేశ స్వాతంత్య్ర సముపార్జన కోసం ఇరువది ఏడు ఏండ్లుకారగారవాసంలో కష్టాలు అనుభవించిన నల్ల సూరీడునెల్సన్ మండేలాపేపర్ బాయ్ నుంచి క్షిపణి నిపుణునిగా,అత్యున్నత దేశాధ్యక్షునిగా ఎదిగినభారతరత్న అబ్దుల్ కలాం వంటి మహనీయుల జీవితపుస్తకాలలోని పుటలనుమనసా వాచా కర్మణా ఆచరిస్తేమన జీవితమనే పుస్తకపు పుటలు కూడా అవుతాయి ఆదర్శంఅపుడే కదా జీవిత సాఫల్యం .....!!.............................
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి