సుప్రభాత కవిత : - బృంద


బండకు కూడా 
పండుగ తెచ్చే 
ఎండను మించిన
నేస్తముంటుందా?

పచ్చని గరికకు కూడా 
ముచ్చట తీరా 
చక్కగ పెరిగే సత్తువ 
ఇచ్చే దాత ఎండే కదా!

చిక్కని అడవిలో 
చిక్కుకున్న తీగలకు 
దూసుకు వెళ్లి ప్రేమగా 
ఆహారమిచ్చేది  ఎండే కదా!

కన్నులు చూడని చోటుకు 
సన్నగా చేరుకొని 
ఎన్నో కీటకాలను పోషించే 
స్నేహం ఎండదే కదా!

పోగమంచును  కోసేసి 
సెగ కొంచెం పెంచేసి 
కత్తిలా బెదిరించి చలిని 
తరిమేసే మిత్రుడు ఎండేగా!

నింగిని పగలే వెలిగె 
ఆకాశ దీపం తానై 
లోకాలకు వెలుగులు పంచే 
అందరి బంధువు ఆదిత్యుడేగా!

🌸🌸సుప్రభాతం 🌸🌸

కామెంట్‌లు