సామెతల ఊట- సునందమ్మ నోట: - వురిమళ్ల (భోగోజు) సునందా ఉపేందర్ రావు ఖమ్మం

 

 సామెత -393: ఈగల నడ్మిట్ల ఈనుపోతు ముసురుతుంది
****
"అవ్వా! మనూల్లె గా వొయిసు పోరగాండ్ల యిష్యం తెల్సుకదా! గా పోరగాండ్లకి ఒక్కటన్న ఆయిమన్న బుద్ధులు లేవు. లంగా లవురీజు గాండ్ల లెక్క తయారయ్యిర్రు. వాయి వొరుసు లేదు తొవ్వన బోయెటోళ్ళని ఏవోవో కూతలు కూసుడు .గదేం పన్రా అని ఎవలన్న నిలదీత్తే నిన్నన్ననా సక్కంగ బో ఎక్వ తక్వ మాట్లాడితే బొక్కలేర్తమని పెద్దా శిన్న లేకుండ వాగుడు ఎక్వైందట అవ్వా. వున్నదొక్కటే తొవ్వాయె పొద్దున లేత్తె గా తొవ్వనించే అటీటు పోవుడుంటదాయె. ఆడివిల్లలైతే గజ్జున వొణుకుతుర్రవ్వా గా పొల్లగాండ్ల శేట్టలకి." 
 అవునటగా శెల్లే! గీ యిష్యం నా దన్క సుత వొచ్చింది. గా పొల్లగాండ్లు ఆడివిల్లలను షెడాయిచ్చుడు.గిదేందని గట్టిగ నిలదీత్తే ఇంకాత్త ఎక్కువ శేత్తుర్రట.ఆడివిల్లలు సద్వులకు పొయ్యేతందుకు బయవడి మానెత్తుర్రు. గా పొల్ల గాండ్లకి అమ్మ అయ్యలు లేరా శెల్లే? అద్దున బెట్టుకోక పోతే ఎట్ల ?"
 "ఎందుకు లేరు అవ్వా! అమ్మ నాయిన శెప్పిన మాటింటే గట్లెట్ల అయితరు. గా పోరగాండ్లకి అమ్మ నాయిన్లే బయపడి సత్తుర్రు. ఏవఁన్నంటే సత్తం గిత్తమని బెదిరిచ్చుడు. ఇంట్లె అందిన కాడికి దొబ్బుక పోవుడట.గీ పోరల పన్కి నల్గుట్ల తల్కాయ ఎత్తుకోని తిర్గ లేక పోతుర్రు."
"ఇంకో యిష్యం తెల్సునా అవ్వా!"  గీ నడ్మన గా పొల్లగాండ్ల గుంపుల కొత్త పోరడు శెరీక అయ్యిండట.ఇంగ గాడు మా పోరంబోకోడట. సైన్మాల యిలను లెక్కనే ఉంటడట.గాన్ని సూశి ఇంక మరింత బయంవడ్తుర్రు అవ్వా!"
"గట్లనా శెల్లే "ఈగల నడ్మిట్ల ఈనుపోతు ముసురుతుంది" అన్నట్టుంది గద  పరిత్తితి. గాళ్ళకి ఎట్ల బుద్ది జెప్పాల్నో నాకు తెల్సు.ముందుగాల గా పొల్లగాండ్ల అమ్మా నాయిన్లని పిల్పిచ్చాలి.పోలీస్లకుయిష్యం జెప్పి నాలుగు ఉతికిచ్చుడో, సక్కంగ టేషన్లకి తోల్క బొయ్యి పోలీసోల్ల దెబ్బ రుశి శూపిచ్చుడో శేద్దాం."
 "అవును గని అవ్వా! గా ఈగల నడ్మిట్ల ఈనుపోతు అన్నవేంది?"
 "ఓశోష్ గదా శెల్లే! గా పోరల్ని ఈగల్లెక్క అన్కుంటే గా కొత్తగొచ్చిన పోరన్ని  ఈనుపోతు అన్నగద.ఈనుపోతు అంటే  పెద్దీగ. గది ఈగలక్కెడుంటేె గక్కన్నే ఉంటది.గదాన్ని ఎంత యిదిలిచ్చినా పోదు శెల్లే."
"గందుకే ఏదన్న వుపాయం శెయ్యి అవ్వా!"
 "గదే సోంచాయిత్తున్న శెల్లే! గాల్లకి ఎట్ల గడ్డి వెట్టాలా అని?"
"గదండీ సంగతి "ఈగల నడ్మిట్ల ఈనుపోతు" అంటే గిదే మరి. అసలే ఈగలు శెడు మీద ఆలినట్టే గస్మంటోళ్ళు శెడ్డ పన్లు శేత్తుంటరు. గా  శెడ్డ పన్లు శేసేటోళ్ళకి ఇంకోడు పెద్దీగ లెక్క గందుల జేరి మరిన్ని శెడ్డ పన్లు శేపిత్తడన్న మాట.గస్మంటోళ్ళుసుట్టుపక్కల  ఏడన్న వుంటే జెర జాగర్తగ ఉండుర్రి.అసలే గీ కలికాలం దినాలు బాగ లెవ్వు‌.గాల్లిష్యం ఎవలికి తెల్వకుండ పోలీసులకు  శెప్పుర్రి.మిగతాది గా పోలీసోల్లె సూస్కుంటరు.మాటేశి పట్కొని బట్టల్ని ఉత్కినట్టు ఉత్కుతరు. గప్పుడు గాని బుద్ధి గ్యానం రాదు.గా పని శేద్దాంరుల్లా..."
కామెంట్‌లు