మహాభారతంలోస్వర్గారోహణపర్వం అచ్యుతునిరాజ్యశ్రీ


 జనమేజయుడు వైశంపాయనుని అడిగాడు"నాప్రపితామహులు పాండవులు,కౌరవులు  స్వర్గంలో ఏస్థానంలో ఎలా ఉన్నారు?" ఆయన ఇలా అన్నాడు"దుర్యోధనుడు కాంతితో దివ్యసింహాసనంపై స్వర్గంలో ఉండటం చూసి,ధర్మరాజు అక్కడ ఉండటానికిష్టపడలేదు."మమ్మల్ని అంత బాధ పెట్టిన సుయోధనుడు ఇలా స్వర్గంలో ఉండటం ఏంటి?"అప్పుడు నారదుడిలా అన్నాడు" నాయనా! స్వర్గంలో  విరోధం అసమానతలుండవు.తను యుద్ధంలో వీర మరణం పొందాడు.వైరభావం వీడు"."సరే,నాతమ్ముళ్లను చూడాలనుకుంటున్నాను.మా అన్న కర్ణుని చూడాలని ఉంది."దేవదూతవెంట  ధర్మరాజు భీమాదులున్నచోటికి బైలుదేరాడు.దారిలో ఘోరాంధకారం,దుర్గంధం,ప్రేతాలున్నప్రాంతాల్ని దాటుకుంటూ బాధ గా నడవసాగాడు. వేడితో మసులుతున్న నదిని, చురకత్తుల ఆకులతో ఉన్న  అసిపత్రమనే వనం చూస్తూ బాధ పడ్డాడు."నా తమ్ముళ్లు ఎక్కడ?" విసిగి అలిసిన యుధిష్ఠిరుని దేవదూత  తిరిగి వెనక్కి తీసుకెళ్లాడు.అక్కడ ఆర్తనాదాలతో జీవులు ఇలా అన్నారు" నేను కర్ణుడిని,భీమ అర్జున నకూలసహదేవ ద్రౌపది,ఆమె పుత్రులం .""అయ్యయ్యో! నావారంతా ఇలా ఘోరమైన దుస్థితిలో ఉండటం,నరకంలో పడి ఉండటం ఏంటని" బాధ పడసాగాడు. దేవదూతతో అన్నాడు" నేను ఈపాపకూపంలో నావారితోనే ఉంటాను." అప్పుడా దేవదూత  ఇంద్రునిదగ్గరకెళ్లి  జరిగినదంతా చెప్పాడు🌹
కామెంట్‌లు