Loneliness అంటే ఒంటరితనం. Solitude అంటే మనస్ఫూర్తిగా ఎంచుకున్న ఏకాంతం.
ఒంటరితనానికి, ఏకాంతానికి మధ్య ఉన్న తేడా అర్థమైన క్షణంలోనే మనలో ఒక కొత్త మేల్కొలుపు కలుగుతుంది.
మౌనం ఒక తపస్సు…
మౌనం ఒక ధ్యానం…
మౌనం ఒక ఏకాంతం…
మౌనం ఒక మహాశక్తి…
మౌనం ప్రపంచంలోనే అత్యంత గొప్ప భాష.
వెయ్యి మాటలు చెప్పలేని అర్థాల్ని ఒక్క క్షణం మౌనం మనకు తెలియ జేస్తుంది.
మనసు నిశ్చలంగా మారితే కలిగేది ప్రశాంతమైన ఆనందం.
అదే మాటలు కూడా ఆగిపోయి, మనసు సంపూర్ణ నిశ్శబ్దంలో మునిగిపోతే కలిగేది పరమానందం.
ఎలాంటి శబ్దాలూ లేని ప్రశాంతమైన వాతావరణంలో, మనకు మనమే తోడుగా ఏకాంతంగా కూర్చుని ఉన్నామనుకోండి…
అప్పుడెక్కడి నుంచో ఒక అందమైన సీతాకోకచిలుక వచ్చి మన అరచేతిపై నిశ్శబ్దంగా వాలుతుంది.
ఆ తర్వాత మన ముక్కు కొనపై వచ్చి కూర్చుంటుంది.
ఆ అద్భుతమైన అందాన్ని మనసారా ఆస్వాదించాలి.
అది స్వర్గం నుంచి మనల్ని ఆశీర్వదించడానికి వచ్చిన ఒక చిన్న దూత అని అనిపిస్తుంది.
ఇది నిజమే కావచ్చు…
లేదా
ఒక అందమైన ఊహ కావచ్చు…
కానీ ప్రకృతిలోని ప్రతి అందం మనసుకు ఒక మధురమైన అనుభూతినే ఇస్తుంది.
రంగురంగుల సీతాకోకచిలుకలు…
వివిధ రంగుల్లో విరబూసే పూలు…
ఆకాశంలో వెలిగే చందమామ…
వర్ణవర్ణాల ఆకాశం…
మిణుకు మిణుకుమనే నక్షత్రాలు…
ఇవన్నీ మనసుకు ఆనందాన్ని పంచే అద్భుతాలే.
అలాగే మన జీవితాల్లోకి దగ్గరయ్యే పిల్లలు, స్నేహితులు, ఆత్మీయులు, స్నేహబంధాలు, బంధువులు, మనకు ఎదురయ్యే అనుభవాలు…
ఇవన్నీ కూడా స్వర్గం నుంచి మనల్ని ఆశీర్వదించడానికి వచ్చిన కానుకలే అని భావిస్తే ఎంత బాగుంటుంది!
జీవితంలో మనల్ని పలకరించే
ప్రతి మనిషిలోనూ
ఒక అందాన్ని చూడాలి.
మనకు ఎదురయ్యే ప్రతి అనుభవంలోనూ
ఒక పాఠాన్ని గుర్తించాలి.
మన జీవితంలో గడిచే ప్రతి క్షణాన్ని ప్రేమతో ఆస్వాదించాలి.
ప్రతి చిన్న ఆనందాన్ని
మనసారా అనుభవించాలి.
అలా జీవించడం నేర్చుకుంటే…
మన ఆనందానికి ఎప్పటికీ లోటుండదు.
ఎందుకంటే…
ఆనందం అనేది ఎక్కడో వెతుక్కుంటే దొరికే సంపద కాదు.
మన చుట్టూ ఉన్న అందాల్ని,
మన దగ్గరకు వచ్చే మనుషుల్ని, మనకు లభించే ప్రతి క్షణాన్ని మనసారా ఆస్వాదించడంలోనే దాగి ఉన్న అమూల్యమైన వరం.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి