సామెత-386: ఈదబోతే తాగ నీళ్ళు లేవు
**
"ఏందో అవ్వా! ఏం కాలమో ఏమో?గిప్పుడే గిట్లుంది రేప్రేపు ఇంగెట్లుంటదో ?"
"అవును శెల్లే! నాకు సుత బయమేత్తుంది. శిన్నతనంల ఎటు సూశినా పతిల్లు పచ్చని శీరగట్టి శింగారిచ్చినట్టు ఇంటి ముంగల ఏప శెట్టునో మాడి శెట్టునో వుండేది. దాన్కి గట్టిన అర్గుల మీద కూసోని పెద్దోళ్ళు ఊల్లె ముచ్చెట్లు,శిన్నోళ్ళు ఆటలు పాటల్తో సర్దాగ గడిపేటోళ్ళు. గియ్యాల గా శెట్లు లెవ్వు.ముచ్చెట్లు లేవు. ఎవలింటికి ఆళ్ళు కంప గొట్టుకున్నట్లు ముచ్చట్లు లెవ్వు .ముష్నాకులు లెవ్వు.పొద్దత్తమానం ముస్లోల్లు ముత్కోళ్ళు గా టీవీల తాన కూసోని గందుట్ల ఏడిత్తే ఏడ్సుడు, నవ్విత్తె నవ్వుడు శేత్తుర్రు. ఇంటికెవలన్న సుట్టపోడొత్తె గాని శెర అంతింత గాదు.మంచి శెబర అడ్గుడు లేదు,అర్సుకునుడు లేదు."
"గదంత వో తీరైతే పతొక్కలు గుడిశెలు, రేకులు పీకేశి సిమెంటిండ్లు గట్కున్నరు గది సంబురమే గని శెట్లు గయ్యీటి ఆకులు ఎవలూడుత్తరు,శాకిరి శేత్తరు అన్కుంట ఇంట్లె మొత్తంగ బండలు బరిపిచ్చి శెట్ల జాడ కాన్రాకుండ శేత్తుర్రు."
"అవునవ్వా! శిన్న శిన్న పిలాస్టిక్ డబ్బాలు, బొక్కెన్లు దెచ్చి గందుట్ల మొక్కలు పెంచుకుంటే గిప్పుడో కొత్త అలవాటు అయ్యింది."
'అవును శెల్లే! గదొక్కటే గాదు,రోడు ఎలడ్పు అని వొందల సంవత్సరాల వొయిసు శెట్లను సత్తెనాసు సేశిర్రు."
"అవును శెల్లే? మీ బావకి మొదగాల నించి అడ్విల ఉన్న బాయిల ఈత గొట్టి వొచ్చుడు అల్వాటు. గీ నడ్మల పెయ్యి బాలేక నెల దినాల్నించి పోట్లేదు. మొన్న ఈతకి బొయ్యే తల్కి బాయిల నీళ్ళన్ని అడ్గంటి వోయింది సూశి ఈతెట్ల గొట్టాల్న తెల్ళక పరేషాను అయితండు."
"అవునవ్వా! ఎన్కట ఊరికొక్క బాయి మంచిల్ల కోస్రం వుండేది.ఇంగ శెరువుల్ల,ఏరుల్ల ఈతలు గొట్ట బోవుడు వుండేది. గిప్పుడు గా శెర్వులు ఈతలకి గాదుగద. నీళ్ళు లేక నెర్రెలు వాసినయి అవ్వా!"
"అవును శెల్లే! గిప్పుడు గట్లనే వుంది కాలం. "ఈద వోతె తాగ నీళ్ళు లేవు అన్నట్టుంది".ఒకేపేమో కాలమట్ల బయవెట్టిత్తుంది. ఇంకోయేపేమో బత్కును ఈదడానికి సుత దార్లు మూస్క వొయ్యి మడిషి ఆగమాగమైతుండు శెల్లే!"
అంటేందో అర్తం మన్సుకెక్కలే. మల్లోపాలి శెప్పవ్వా!"
"గదే శెల్లే! ఒకేపు బూపెపంచకం అగ్గోలె బగ్గున మండుకుంట సల్ల గాలి దొరక్క,తాగు నీళ్ళు దొరక్క కొనుక్కునే తితి వొచ్చింది గద! ఇంగ గట్లనే ఎటు సూశినా కర్వుతో బతికే తొవ్వలు కాన్రక ఎట్ల బత్కాల్నో అల్లాడి పోతుండు మడిషి.గిప్పుడు తానాల కోస్రం గాదు తాగు నీళ్ళ కోస్రం తండ్లాడినట్టుంది శెల్లే పరిత్తితి."
"అవునవ్వా! మా పెద్దన్నోల్లు పట్నంల ఉంటరు. ఇల్లు సల్లబర్శే ఏసీలు ఆడ్తరట.నెలకి ఏలకి ఏలు కరెంట్ బిల్లు వొత్తుందని,గది లేకుండా బత్కలేమని శెప్పింది యాదికొచ్చింది."
"అవును శెల్లే ఇంగెన్ని యిపరీతాలు సూడాల్నో గీ కలి కాలంల.కాని కాలంల."
గదండీ సంగతి! " "ఈదబోతే తాగ నీళ్ళు లేవు" అన్నట్టుంది అంటే గిదే మరి."

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి