టైమ్ ఇస్తే టేస్ట్ మారుతుంది: - కొత్త విరిత
 

ఒకప్పుడు నచ్చని వ్యక్తి,
కాలం గడిచేకొద్దీ మనసుకు బాగా నచ్చేస్తాడు!
అప్పుడు చిరాకు తెప్పించిన మాటలే, ఇప్పుడు “ఎంతో నిజం!” అనిపిస్తాయి.
చేయమంటే చేయని పనులే,ఒకరోజు మనమే ఇష్టంగా చేయడం మొదలుపెడతాం.నిన్నటి వరకు నచ్చని అలవాట్లు,
ఈరోజు మన “పర్సనాలిటీ”లో భాగమైపోతాయి
ఒకప్పుడూ నచ్చని బ్లాక్ కాఫీ,ఎప్పుడూ డైలీ డైట్ లో భాగం అయిపోతుంది.సినిమాల సంగతి మరీ వింత.రిలీజ్‌ రోజున ఫ్లాప్‌…రెండేళ్ల తర్వాత రీ-రిలీజ్‌ అంటే “కల్ట్ క్లాసిక్!”అప్పుడు థియేటర్‌లో ఖాళీ కుర్చీలు…ఇప్పుడు టికెట్ల కోసం క్యూలు!అప్పుడు నచ్చని పాటే,ఇప్పుడు ఫోన్ రింగ్‌టోన్‌గా మారుతుంది.
అంటే విషయం మారిందా?
లేక మన అభిరుచే అప్‌డేట్‌ అయిందా?
బహుశా కొన్ని విషయాలు నచ్చడానికి వాటికి కాలం అనే ఒక మంచి మార్కెటింగ్‌ మేనేజర్‌ కావాలి!
అందుకే “తినగా తినగా వేము తీయగుండు”
అన్న సామెత ఇప్పటికీ నిత్యసత్యమే.
మనం గుర్తుంచుకోవాల్సిన మూడు విషయాలు:
1. ఈ రోజు నచ్చలేదని, జీవితాంతం నచ్చదని నిర్ణయించకూడదు.
2. మనుషులు, పరిస్థితులు, మన అభిప్రాయాలు అన్నీ కాలంతో మారుతాయి.
3. ఏదైనా నచ్చినప్పుడు, అది ఎందుకు నచ్చిందో కూడా గుర్తుంచుకోవాలి.
చివరికి సత్యం ఒక్కటే
"టైమ్ ఇస్తే టేస్ట్ మారుతుంది!"
కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
Excellent write up
అజ్ఞాత చెప్పారు…
Excellent write up 👌💯