సామెత -397 ఈతొచ్చినోనికి లోతనిపిస్తదా
**
"అవ్వా! కొంతమందిరి మీద కాలానికి కనికరముండదెందుకో..పరీచ్చల మీద పరీచ్చలు పెట్టి ఎట్ల తట్టుకుంటరాని తమాష సూత్తది. ముప్పేట్ల కట్టాలు ముస్రిపిచ్చి ఎట్ల బయిట వడ్తరాని ఎద్రుసూత్తది.ఏందో అవ్వా! మడిషి బత్కుడంటే సముద్రమసుమంటి కాలాన్ని ఈదుడే."
"ఏంది శెల్లే! ఏందో ఏదాంతం సిద్దాంతం శెప్పబడ్తివి. ఎన్నల్లేంది గియ్యాల కాలమ్మీద బడ్డది నీ మన్సు. లోకమొక్క తీర్గ ఎట్టుండదో కాలం సుత ఒక్క తీర్గ వుండదు శెల్లే! "అదృట్ట వంతున్ని శెడగొట్టలేం- దరిద్దున్ని బాగు శెయ్యలేం'' అన్న తీర్గ గీ కాలం ఎన్నెన్నో శిత్రాలు జేత్తది శెల్లే!"
"నీకు తెల్సుగద శివయ్య మావ వైబోగం. మన శిన్న తనం నుంచి సూశినం.కాల్మీద కాలేస్కుని అవల్ దర్జాగా బతికిండు. నౌకర్లు శాకర్లు, ఇంటికి వొచ్చేటోళ్ళు,పోయేటోళ్ళు ఎప్పుడు సూశినా ఇల్లు ఓ తిర్నాల లెక్క ఉండేది.గసుమంటి మావ జాత్కం సంద్రం నడిమిట్ల బొల్త వడ్డ నావొతికైంది అవ్వా!"
"గట్లెట్లయింది!శెల్లే! గిప్పట్కీ గది తల్సుకుంటే మాయొత్కెనే అనిపిత్తది. ఏన్గు మింగిన ఎల్గపండు లెక్క ఆత్తంత బొయ్యి గా మావ బికారి లెక్క అయినప్పుడు గాయిన మంచితనం తెల్శినోళ్ళు గా మడిషి ఏమైతడోనని కండ్ల నీళ్ళు బెట్కుర్రు.
"గంత లాశారైనా అవ్వా! ఫికర్ బడకుండ మల్ల మొదిటి కానించి బత్కు పోరు మొదలు వెట్టుడు సూశి గప్పట్ల ఊల్లె అందర్కి మా శిత్రంగ అన్పిచ్చింది అవ్వా!"
"గదే శెల్లే" ఈతొచ్చినోనికి లోతనిపిస్తదా? గా యాపారంల మావఁ శానా శానా డక్కామొక్కీలు తిన్నోడు. గంద్కనే కాలం తిర్గవడ్డా బయవడకుండ పోగొట్టుకున్న తాన్నే ఎతుక్కోవాలె అనుకుండు .శిన్నగ శిన్నగ గిప్పుడే మొదలువెట్టాలన్కుండు.మొదలు వెట్టిండు.కొడ్కలకు బిడ్డల్కి బారం గాకుండా బత్కుతున్నడు."
"నిజం అవ్వా! మావకి యాపారంల ఈదుడే గాదు.బత్కు ఎట్ల ఈదాల్నో తెల్సు గాబట్టి గిట్ల బచాయించిండు. ఇంకోలు ఇంకోలైతే గింత కట్టమొత్తే కోమాలోకి ఎల్లి మల్లెనక్కి రాక పోదురు."
"అవును శెల్లే గట్ల గుండె దైర్నం దెచ్చుకొని బత్కాలె. సత్తె ఏమొత్తది శెప్పు."
"గదండీ సంగతి! "ఈతొచ్చినోనికి లోతనిపిస్తదా" అంటే గిదే మరి.బత్కు ఈత వొచ్చినోనికి కత గిట్లుంటది మరి."

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి